సరికొత్త కథలతో ఎప్పటికప్పుడు కొత్త కొత్త సీరియల్స్ చేస్తూ అభిమానులను అలరిస్తున్న బుల్లితెర నటీనటుల గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ముఖ్యంగా దేశవ్యాప్తంగా వున్న యంగ్ టాలెంట్ ని ప్రోత్సహిస్తూ పక్క రాష్ట్రాల నటులకి కూడా గొప్ప అవకాశాలను అందిస్తోంది. ఈ క్రమంలోనే సంవత్సరాల తరబడి బుల్లితెరపై టెలికాస్ట్ అవుతున్న సీరియల్స్ కూడా చిట్ట చివరి ఎపిసోడ్ వరకు తొలి ఎపిసోడ్ టెన్షన్ కొనసాగిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నాయి. ఈ క్రమంలోనే బుల్లితెర పై తమదైన పాత్ర పోషిస్తూ టాప్ లో ఉన్న హీరోయిన్స్ గురించి ఇప్పుడు మనం చూద్దాం


ఐశ్వర్య పిస్సే: అగ్నిసాక్షి సీరియల్ ద్వారా గౌరీ పాత్రతో అందరిని అలరిస్తున్న ఈమె తెలుగులోనే కాకుండా తమిళ్ , కన్నడ టెలివిజన్లో కూడా చక్రం తిప్పుతోంది. 2017 నుంచి సీరియల్స్ లోనే బిజీగా గడుపుతున్న ఈమె ఒకదాని తర్వాత ఒకటి సీరియల్స్ చేస్తూ ప్రతిపాత్రలో కూడా తన మార్కును చూపిస్తోంది.

అశ్మితా కర్ణాని: మాతృదేవోభవ , మట్టి గాజులు, భాగ్యరేఖ వంటి సీరియల్స్ తో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న ఈమె పద్మవ్యూహం సీరియల్ లో గౌరీ పాత్రతో తెలుగు చలనచిత్ర పరిశ్రమకు పరిచయమైంది. ఆ తర్వాత తెలుగు సీరియల్స్ లో కీలకంగా మారిన ఈమె ఇప్పటివరకు 15 కు పైగా సీరియల్స్ లో నటించి తన నటనతో కొత్త కొత్త అవకాశాలను దక్కించుకుంటుంది.

మేఘన లోకేష్:దాదాపు 270 కి పైగా షోలు చేసిన మేఘన.. దేవి సీరియల్ లో సపోర్టింగ్ రోల్ చేసిన మేఘన పవిత్ర బంధం లో కీ రోల్ పోషించింది. ఇక ఆ తర్వాత శశిరేఖ పరిణయం సీరియల్ లో మేఘన బ్లాక్ బస్టర్ పర్ఫామెన్స్ కు నిదర్శనంగా నిలిచింది. 2013లో ఆమె కెరియర్ ప్రారంభించగా ఇప్పటికీ అదే జోష్ తో దూసుకుపోతుంది.

సుహాసిని: టాప్ తెలుగు టెలివిజన్ నటీమణుల జాబితాలో సుహాసిని పేరు కచ్చితంగా ఉంటుంది.  అపరంజి సీరియల్ తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈమె తన తొలి సీరియల్ తోనే మంచి గుర్తింపు అందుకుంది. ఆ తర్వాత సినిమాలతో బిజీ అయిన ఈమె మళ్లీ సీరియల్స్ లోకి రియంట్రి ఇచ్చి నిర్మాతగా కూడా కొనసాగుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: