ప్రముఖ యాంకర్ గా పేరు పొందిన శ్రీముఖి హోస్ట్ గా చేస్తున్న కిర్రాక్ బాయ్స్ ఖిలాడి గర్ల్స్ సీజన్ 2 ఆడియన్స్ ని బాగానే ఎంటర్టైన్మెంట్ చేస్తూ ఉన్నది. ముఖ్యంగా ఈ షోలో గొడవలు, గేమ్స్ అన్నీ కూడా బిగ్ బాస్ షో లాగా ఉండడంతో చాలామంది ఆడియన్స్ చూడడానికి మక్కువ చెబుతున్నారు. అయితే ఈ షోలో కూడా ఎలిమినేషన్ వంటివి కూడా ఉంటాయి. తాజాగా ఎపిసోడ్ కి సంబంధించి ప్రోమోని విడుదల చేయగా.. ఆకట్టుకునేలా కనిపిస్తోంది. ఈ ప్రోమో విలేజ్ థీమ్ అనే కాన్సెప్ట్ తో షూటింగ్ చేసినట్లు కనిపిస్తోంది.


దీంతో అమ్మాయిలంతా చీరలు, లంగా ఒనిలో కనిపిస్తూ ఉంటే అబ్బాయిలు లుంగీలు, పంచ కట్టుతో ఈ షోకి రావడం జరిగింది. అయితే ఈ ప్రోమోలో ఇమ్మానుయేల్ ని కిందపడేసి మరి కాలితో ఎగిరెగిరి  సీరియల్ నటి వేద కాలితో తన్నడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అయితే ఇది స్కిట్ లో భాగంగా చేశాట్లుగా కనిపిస్తోంది. కానీ ఎంత స్కిట్లో అయినా కూడా ఇలా చేయడం తప్పు అంటూ పలువురు నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.


ఇక మరొకవైపు శ్రీముఖి, శేఖర్ మాస్టర్ కూడా పల్లెటూరి మనుషుల గెటప్పులు వచ్చారు. శ్రీముఖి..శేఖర్ మాస్టర్ ని చూపిస్తూ నేను చెరువుగట్టు దగ్గర ఒక అమ్మాయితో మిమ్మల్ని చూశాను అంటూ చెప్పగా ..ఆ విషయానికి శేఖర్ మాస్టర్అమ్మాయి శ్రీముఖినే అంటూ చెయ్యే చూపిస్తారు. అలాగే యాదమ్మ రాజు కూడా తన కామెడీతో కడుపుబ్బ నవ్వించారు. అమరదీప్ తో పాటుగా మరికొంతమంది కంటెస్టెంట్స్ అందరూ కూడా తమ కామెడీతో ప్రోమో అని హైలెట్ చేశారు. అయితే ఈసారి ఎలిమినేట్లో శివకుమార్ అబ్బాయిల నుంచి ఎలిమినేట్ అయ్యేలా అమ్మాయిల నుంచి ఐశ్వర్య ఎలిమినేట్ అయ్యేలా ఉందంటూ చూపించారు.. మరి ఈ వారం ఎవరు ఎలిమెంట్ అవుతారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: