తెలుగు బుల్లితెర పై స్టార్ కపుల్ గా పేరు పొందిన ప్రియాంక జైన్, శివ్ గురించి చెప్పాల్సిన పని లేదు. సీరియల్స్ లో ప్రేమికులుగా నటించిన ఈ జోడి నిజ జీవితంలో కూడా వివాహ బంధంతో ఒకటి కాబోతున్నారు. ప్రస్తుతం వీరిద్దరు లివింగ్ రిలేషన్ లో ఉన్నట్లు కొన్ని రకాల ఫోటోలను వీడియోలను అప్పుడప్పుడు షేర్ చేస్తూ ఉంటారు. తాజాగా ఈ జోడి గురించి ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నది. అది కూడా యాంకర్ శివ ఇంటర్వ్యూ చేస్తున్న సమయంలోనే ఇది జరిగినట్టుగా కనిపిస్తోంది.


ప్రముఖ యూట్యూబ్, బిగ్ బాస్ ఫేమ్ శివ ఇంటర్వ్యూకి ప్రియాంక జైన్, శివ్ హాజరుకాగా.. ఆ సమయంలోనే యాంకర్ శివ వీరి రిలేషన్ ని ఆర్టిఫిషియల్ రిలేషన్ అని పబ్లిసిటీ కోసమే ఇలా యాక్టింగ్ చేస్తున్నారని చాలామంది ప్రశ్నిస్తున్నారు అంటూ  యాంకర్ శివ ఈ జోడిని అడగగా.. ఆ వెంటనే ప్రియాంక జైన్ బాయ్ ఫ్రెండ్  శివ్ ఫైర్ అవుతూ.. మాది నేచురల్ రిలేషన్ అని.. అలాంటి ప్రస్తావన తమ దగ్గరకు తీసుకురావద్దంటూ గట్టిగా నిలదీశారు.

అంతేకాకుండా అదే కోపంతో పక్కన ఉన్న దిండును తీసుకొని ఏకంగా యాంకర్ శివా మీద విసిరిన సన్నివేశం ఇప్పుడు అందర్నీ ఆశ్చర్యానికి గురయ్యారా కనిపిస్తోంది. మొదట ఈ వీడియో చూసిన వారందరూ కూడా ఆశ్చర్యపోయిన చివరిలో ఈ వీడియో మొత్తం ఫ్రాంక్ అని క్లారిటీ ఇచ్చారు. లైవ్ ఇంటర్వ్యూలో సీరియస్ గా కనిపించే ఈ విషయాన్ని చాలా ఫన్నీగా స్కిట్ చేయడంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్న కొంతమంది నెటిజన్స్ మాత్రం ఫైర్ ఎమోజిలతో వైరల్ చేస్తున్నారు. ఈ వీడియో చూసిన వారందరూ కూడా మాక్సిమం నమ్మేసినట్టుగా కనిపిస్తోంది. నిజానికి ఇలాంటి ఫ్రాంక్ వీడియోల వల్ల అసలు ఇంటర్వ్యూలలో జరిగే సంభాషణ గురించి కూడా చాలామంది నమ్మేలా కనిపించడం లేదు. విమర్శలు కూడా చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: