తెలుగు బుల్లితెరపై జబర్దస్త్ షో కమెడియన్గా హైపర్ ఆది ఎంతటి క్రేజ్ అందుకున్నారో తెలిసిందే.. అదే క్రేజ్ తో వెండితెర పైన కూడా పలు చిత్రాలలో నటించి స్టార్ కమెడియన్ గా పేరు సంపాదించారు. జబర్దస్త్ ను వీడి చాలామంది ఇతర టీవీ ప్రోగ్రామ్స్ లలో సందడి చేస్తున్నారు. అలా జబర్దస్త్ యాంకర్ గా పేరు పొందిన అనసూయ కూడా ఈ షో నుంచి బయటికి వచ్చింది. హైపర్ ఆది వల్లే అనసూయ జబర్దస్త్ వదిలేసింది అంటూ గత కొద్దిరోజులుగా ప్రచారం జరిగింది. దీనిపైన తాజాగా హైపర్ ఆది మాట్లాడుతూ క్లారిటీ ఇచ్చారు.


జబర్దస్త్ కామెడీ షోలో అనసూయ, హైపర్ ఆది మధ్య స్నేహబంధం గురించి చెప్పాల్సిన పనిలేదు. వీరిద్దరి మధ్య పంచ్ డైలాగులే కాకుండా సెటైరికల్ కామెంట్స్ కూడా అప్పుడప్పుడు వైరల్ గానే మారుతూ ఉంటాయి. అయితే గతంలో అనసూయ పై హైపర్ ఆది చేసిన కొన్ని కామెంట్స్ వల్లే ఆమె జబర్దస్త్ ని వదిలి వెళ్ళిపోయిందని ప్రచారం జరిగింది.. తాజాగా ఇలాంటి రూమర్స్ కి అడ్డుకట్టు వేస్తూ హైపర్ ఆది క్లారిటీ ఇచ్చారు..హైపర్ ఆది మాట్లాడుతూ.. అనసూయ గారితో తనకు ఎలాంటి గొడవలు లేవని.. మిగతా వారి స్కిట్లలో కంటే తన స్కిట్లోనే ఎక్కువగా నటించడానికి కనిపించడానికి ఇష్టపడేది అంటూ తెలిపారు.


అనసూయ జబర్దస్త్ విడడం వెనుక మరొక కారణం ఉందని తెలిపారు. సినిమాలలో ఆఫర్లు రావడం వల్ల తన ఫ్యూచర్ ని ఆలోచించి అనసూయ యాంకర్ గా కంటే నటిగానే బెటర్ అనుకొని ఆ వైపుగా నిర్ణయం తీసుకుందని తెలియజేశారు హైపర్ ఆది. అంతేకానీ తన వల్ల జబర్దస్త్ కి దూరమైందనే విషయాలలో ఎలాంటి నిజం లేదంటూ తెలియజేశారు. ఎవరైనా సరే ఎదగాలనుకుంటారు కానీ అక్కడే ఉండి పోరు కదా అంటూ హైపర్ ఆది తెలియజేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: