
ట్విట్టర్ బ్లూ పేరుతో రానున్న ఈ ప్లాట్‌పాంలో సబ్‌స్క్రిప్షన్ ఛార్జీగా నెలకు 2.99 డాలర్లను ట్విట్టర్ వసూలు చేయనుంది. ఈ సేవల గురించి ట్విట్టర్ నిర్ధారించింది రీసెంట్‌గా. ట్విట్టర్ యాప్ స్టోర్ లిస్టింగ్‌లో.. ట్విట్టర్ బ్లూ ఇన్-యాప్ పర్చేజింగ్‌ను జోడించినట్లు కొన్ని నివేదికలు వెల్లడించాయి. అయితే ఈ విషయాన్ని అధికారికంగా ఇంకా అందుబాటులోకి తీసుకు రాలేదు ట్విట్టర్.
అయితే ఈ సబ్‌స్క్రిప్షన్ సేవలను ముందుగా అమెరికాలో ప్రారంభించాలని యోచిస్తోంది ట్విట్టర్. ఇక మన భారత్‌లో దీనికి రూ.200 నుంచి రూ.270 వరకు వసూలు చేసే అవకాశం ఉంది. ఇందుకోసం ఇప్పటికే ట్విట్టర్ ప్రతిపాదనలు రెడీ చేస్తోంది. సెక్యూరిటీ రీసెర్చర్ జేన్ మంచూన్ వాంగ్ ఈ కొత్త అప్‌డేట్‌ను ముందుగా గుర్తించారు.
ఇందుకు సంబంధించిన వివరాలను ఆయన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఇందులో వెల్లడిస్తూ ట్విట్టర్ యాజమాన్యం ట్విట్టర్ బ్లూను విడుదల చేయనుంది. యాప్ స్టోర్‌లో ఇన్-యాప్ పర్చేజ్‌గా దీన్ని యాడ్ చేశారు. అంటూ ఆయన వెల్లడించారు ఈ సేవలను మనం ఉపయోగించుకోవాలంటే చార్జీలు వర్తిస్తాయిన స్పష్టం చేశారు. దీనికి సంబంధించిన స్క్రీన్ షాట్‌ను కూడా వాంగ్ షేర్ చేశారు. అంతే కాదు ఈ యాప్ ఐకాన్ రంగును కూడా కస్టమర్లు మార్చుకోవచ్చు. బ్లూ నుంచి పింక్, గ్రీన్, రెడ్, ఎల్లో, ఆరెంజ్ లాంటి కలర్లను కూడా వాడుకోవచ్చు. ఒకవేళ వీటి నుంచి మినహాయింపు కావాలంటే కూడా వర్తిస్తుంది. ప్లేన్ థీమ్‌ను సెలక్ట్ చేసుకోవచ్చు. ఈ ఫీచర్లను మీరూ వాడండి.