ఆధార్ కార్డు ఇప్పుడు సామాన్యుని గుర్తింపు కార్డు గా పేరొందింది. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల ఎటువంటి పథకాలు అయిన మనం పొందాలంటే ఈ కార్డు తప్పనిసరి. అయితే కొంత మందికి ఆధార్ కార్డులో పేరు, అడ్రస్ తప్పులు వస్తూనే ఉంటాయి. ఇక మరికొందరికి అయితే మొబైల్ నెంబర్ లింక్ అవ్వకపోయిండవచ్చు. అయితే అలాంటి వారి కోసం ఎటువంటి డాక్యుమెంట్స్ లేకుండా ఆధార్ కు .. మొబైల్ నెంబర్ ను లింక్ చేయవచ్చు. అది ఎలానో తెలుసుకుందాం.


ముందుగా మీ దగ్గరలోని ఆధార్ సెంటర్ కి వెళ్లి మీ ఆధార్ కార్డు కి మొబైల్ నెంబర్ లింక్ అయిందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ కాకుంటే ఆధార్ సెంటర్ లో డైరెక్ట్ గా అపాయింట్మెంట్ తీసుకోని, ఎటువంటి పత్రాలు లేకుండా మొబైల్ లింక్ చేయమని కోరవచ్చు. కేవలం
 50 రూపాయలు చెల్లిస్తే సరిపోతుంది.

ఆన్లైన్ ద్వారా చేసే పద్ధతి:

1). ముందుగా మీ మొబైల్ లోని ఏదైనా వెబ్ సైట్ ని ఓపెన్ చేయాలి.

2). ఆ తరువాత అక్కడ UIDAI.GOV.IN అని ఎంటర్  చేసి SEARCHIN  బటన్ మీద క్లిక్ చేయాలి.

3). అక్కడ GET AADHAAR అనే ఆప్షన్ లో ORDER AADHAAR REPRINT అనే ఆప్షన్ క్లిక్ చేయవలసి ఉంటుంది.

4). అక్కడ కనిపించే బాక్స్ లో మీ మొబైల్ ని ఎంటర్ చేసి  క్లిక్ చేసిన తర్వాత ఓటిపి ఎంటర్ చేయాలి.

5). ఆ తర్వాత మీ  స్క్రీన్ పైన  అగ్రి  అనే మెసేజ్ వస్తుంది. దానిపై ఓకే అని క్లిక్ చేయాలి.

6) కింద బాక్స్ మీద  మన ఆధార్ కార్డు యొక్క 12 అంకెల నెంబర్ను ఎంటర్ చేయాలి.

7). అలా ఎంటర్ చేసిన ఆధార్ కార్డు నెంబర్ కి తిరిగి ఓటిపి వస్తుంది. Tearms and conditiones పై అప్లై చేసి, మొబైల్ కి వచ్చిన ఓటీపీ ని ఎంటర్ చేసి క్లిక్ చేయాలి. మీ మొబైల్ నెంబరు ఆధార్ కు లింక్ అయినట్టే.

మరింత సమాచారం తెలుసుకోండి: