మారుతి సుజుకి భారతదేశంలో అతిపెద్ద కార్ల తయారీ కంపెనీగా టాప్ పొజిషన్ లో ఉంది. ఎందుకంటే భారతదేశంలో ప్రతినెలా అత్యధికంగా అమ్ముడయ్యే టాప్ 10 కార్లలో ఆరు లేదా ఏడు మోడళ్లు మారుతి సుజుకికి చెందినవే ఉంటాయి. మారుతి సుజుకి కార్లు అందించే అన్ని వాహనాలు దాదాపు అధిక మైలేజీనిస్తుంటాయి. అవి చాలా విశ్వసనీయంగా ఉంటాయి. కాగా, ఇప్పుడు మారుతి పర్యావరణ సాన్నిహిత్యమైన వాహనాల తయారీపై దృష్టి పెట్టింది.మారుతి సుజుకి ఇప్పటికే ఇండియాలో తమ ప్రోడక్ట్ లైనప్ లో అత్యధికంగా సిఎన్‌జి (కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్) ఆధారిత వాహనాలను అమ్ముతుంది. ప్రస్తుతం, భారతదేశంలో అత్యధికంగా సిఎన్‌జి వాహనాలను సేల్ చేస్తున్న కంపెనీ కూడా మారుతి సుజుకినే కావడం మరో విశేషం. మారుతి సుజుకి ఇటీవలే టొయోటా సహకారంతో తయారు చేసిన తమ మొట్టమొదటి హైబ్రిడ్ ఎస్‌యూవీ గ్రాండ్ విటారాను కూడా మార్కెట్లో విడుదల చేసింది. కాగా, ఇప్పుడు జీవ ఇంధనంతో నడిచే వాహనాలను తయారు చేసేందుకు కంపెనీ ప్లాన్ చేస్తోంది.ఇక భూమిలో శిలాజ ఇంధనాలు అంతరించిపోతున్న నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆటోమోటివ్ తయారీదారులు ప్రత్యామ్నాయ ఇంధనాలతో నడిచే వాహనాల అభివృద్ధిపై దృష్టి పెడుతున్నారు.


చాలా దేశాలలో కూడా ఇప్పటికే ఎలక్ట్రిక్ వాహనాల స్వీకరణ వేగం పెరగగా, మరోవైపు వాహన తయారీదారులు హైడ్రోజెన్ ఫ్యూయెల్ సెల్ పవర్డ్ వాహనాల తయారీపై కూడా వేగంగా అడుగులు వేస్తున్నారు.ఇండియాలో టాప్ ప్యాసింజర్ కార్ల తయారీ కంపెనీగా ఫేమస్ అయిన మారుతి సుజుకి కూడా ప్రత్యామ్నాయ ఇంధనాల వైపు పరుగులు తీస్తోంది. ప్రస్తుతం, కేవలం పెట్రోల్ తో నడిచే వాహనాలను మాత్రమే అందిస్తున్న మారుతి సుజుకి, భవిష్యత్తులో బయో ఫ్యూయల్‌ తో నడిచే వాహనాలను తయారు చేయాలని చూస్తోంది.మారుతి సుజుకి కంపెనీ తమ కార్లకు శక్తినివ్వడానికి బయో ఫ్యూయల్‌ని ఉపయోగించాలని యోచిస్తోంది. మారుతి సుజుకి ఇండియా ఛైర్మన్, ఆర్‌సి భార్గవ మాట్లాడుతూ భారతదేశంలోని అతిపెద్ద కార్ల తయారీ సంస్థ జీవ ఇంధనంతో నడిచే కార్లను అభివృద్ధి చేయడంపై దృష్టి పెడుతుందని పేర్కొన్నారు. బయోమీథేన్ వాడకం ద్వారా ఉద్గారాలను తగ్గించడంతో పాటు సామర్థ్యాన్ని కూడా పెంచుతుందని ఆయన చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: