ప్రస్తుతం దేశంలో ఎలక్ట్రిక్ స్కూటర్లకు మంచి డిమాండ్ ఏర్పడింది.  ఇంధన ధరలు బాగా పెరుగుతుండటం ఇంకా లోకల్ అవసరాలకు ఈస్కూటర్లు బాగా ఉపయోగపడుతుండటంతో వీటి కొనుగోళ్లు బాగా పెరుగుతున్నాయి.అందువల్ల అన్ని కంపెనీలు తమ తమ ఉత్పత్తులను దేశీయ మార్కెట్లోకి ప్రవేశపెడుతున్నాయి.పలు కంపెనీల మధ్య ఇప్పటికే పోటీ వాతావరణం ఏర్పడింది. దీంతో తక్కువ ధర, అధిక ఫీచర్లు ఉన్న స్కూటర్లను తీసుకొచ్చేందుకు చాలా కంపెనీలు ముందుకొస్తున్నాయి.అందుకే ఈ క్రమంలో మన దేశీయ బ్రాండ్ అయిన బీగాస్ తన కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ సీ12ఐ ఎక్స్ ప్రిమీయం ను లాంచ్ చేసింది. అది కూడా కేవలం రూ. 99,999 ఎక్స్ షోరూం ధరకే కంపెనీ అందిస్తోంది. ఎవరైతే సిటీ పరిధిలో ఇంటి అవసరాలకు స్కూటర్ కావాలని కోరుకుంటారో వారికి ఇది ఖచ్చితంగా బెస్ట్ చాయిస్ గా ఉంటుందని కంపెనీ ప్రకటించింది. ఇంకా అంతేకాక దీనికి పర్‌ఫెక్ట్ ఫ్యామిలీ స్కూటర్ అని ట్యాగ్ లైన్ ఇచ్చి మరి బీగాస్ ఈ స్కూటర్ ని లాంచ్ చేసింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.


ఇక ఈ కొత్త స్కూటర్ ధర మన దేశంలో రూ. 99,999 నుంచి స్టార్ట్ అవుతుంది. అయితే ఇంతకు ముందు విడుదల చేసిన సీ12ఐ మ్యాక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ ధర రూ. 1,26,513(ఎక్స్ షోరూం ఢిల్లీ) కాగా, మూడు నెలల్లోనే ఏకంగా 6000 కస్టమర్లు దీనిని కొన్నట్లు బీగాస్ కంపెనీ తెలిపింది. ఇప్పుడు విడుదల చేస్తున్న సీ12ఐ ఎక్స్ స్కూటర్ పై కూడా అదే రకమైన ఆసక్తి ఉందని వారు చెబుతున్నారు.ఈ కొత్త స్కూటర్ అవుట్ లుక్ అయితే చాలా సింపుల్ గా ఉంటుంది. అలాగే డ్యూయ్ టోన్ పెయింట్ మీకు దీనిని అందంగా కనిపించేలా చేస్తుంది. దీని హెడ్ లైట్ రౌండ్ డిజైన్ లో ఉంటుంది. రెట్రో లుక్ లో ఇది చాలా అందంగా కనిపిస్తుంది.ఈ స్కూటర్ ఫీచర్ల విషయానికి వస్తే.. బీగాస్ కంపెనీ దీనికి సంబంధించిన పూర్తి స్పెసిఫికేషన్లను ఇంకా వెల్లడించలేదు. అయితే లో బ్యాటరీ మోడ్ ఉంటుందని మాత్రం కంపెనీ ప్రకటించింది. ఇక ఈ మోడ్లో స్కూటర్ కేవలం గంటలకు 20కిలమీటర్ల వేగంతో మాత్రమే ప్రయాణించగలుగుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: