అందరి దృష్టిని ఆకర్షించాలంటే పెద్ద చదువులు చదవాల్సిన అవసరం లేదు.. కాసింత బుర్రలో గుజ్జు ఉంటే చాలు. ఈ విషయాన్ని చాలా మంది నిరూపించారు.. తరగతులు చదవకుండానే.. ఎన్నో అబ్బురపరిచే వస్తువులను తయారు చేశారు. ప్రపంచ చరిత్ర ను కూడా తిరగ రాశారు. భారత దేశంలో ఇలాంటి ఘటనలు ఏదోక మూల రోజుకొకటి చొప్పున వింటూనే ఉంటాం. ఇప్పుడు కూడా అందరికీ షాక్ ఇచ్చేలా ఓ బామ్మ వినూత్న ఆలోచన చేసింది. దాంతో ఆమె పేరు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.


టెక్నాలజీని ఆమె ఉపయోగించినంతగా ఎవరూ వాడరేమో.. పుట్ పాత్ మీద ఉన్న బామ్మ అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. దాంతో ఆమె వ్యాపారం కూడా రెట్టింపు అవుతుంది. ఇది నిజంగానే గ్రేట్ కదా.. ఇంతకీ ఆమె ఏం చేసింది..జనాలు ఆశ్చర్య పడేలా ఏం చేసిందో వివరంగా తెలుసుకుందాం.. ఆమె సెల్వమ్మ .. ఆమె వయస్సు 75 సంవత్సరాలు.. రెక్కాడితే కానీ ఆమెకు మూడు పూటలా బొజ్జ నిండదు. అలాంటి ఆమె రోడ్డు పక్కన మొక్క జొన్న పొత్తుల ను అమ్ముతుండేది. అలా వయసు పై బడిన కూడా ఆమె ఇలా చేసుకొని బ్రతకడం గ్రేట్ అనే చెప్పాలి.


ఇక విషయానికొస్తే.. మొక్క జొన్న కంకుల ను కాల్చే విధానం చూపరులను విపరీతంగా ఆకట్టుకుంది. సాధారణంగా అయితే కంకులు కాల్చేప్పుడు బొగ్గులు మండటం కోసం విసురుతుంటారు కదా ! ఈ బామ్మ మాత్రం టెక్నాలజీని వాడుకుని కంకులు కాలుస్తోంది. సోలార్ పవర్‌తో నడిచే ఫ్యాన్ గాలితో బొగ్గులను మండిస్తూ కంకులను కాలుస్తోంది. అంతేకాదు సాయంకాలం పూట బండికి కావాల్సిన లైట్ ను కూడా ఈ సోలార్ ప్యానెల్‌తోనే ఏర్పాటు చేసుకుంది. బెంగళూరులో కనిపించిన ఈ దృశ్యాన్ని వీవీఎస్ లక్ష్మణ్ ట్విటర్ ద్వారా పంచుకున్నారు. టెక్నాలజీని వాడుకుంటున్న 75 ఏళ్ల సెల్వమ్మ అదుర్స్ అని వీవీఎస్ లక్ష్మణ్ మెచ్చుకున్నారు. ఈమెను చూసి అందరూ నేర్చుకోవాలని సూచించారు . ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది..

మరింత సమాచారం తెలుసుకోండి: