భాద్యత కలిగిన పదవిలో ఉన్నప్పుడు అందరికి మంచి గురించి చెప్పాలి కానీ, వారే దారి తప్పితే పరిస్థితి దారుణంగా ఉంటుంది. ప్రజలకు వారి పై నమ్మకం పోతుంది. ముఖ్యంగా సమాజాల్లో విద్రోహ శక్తుల నుంచి రక్షించాల్సిన పొలిసు తప్పు చేయడం నిజంగా అమానుషం. ఓ పోలీస్ చేసిన పనికి అందరు షాక్ అవుతున్నారు. అతను చేసిన పనికి అతని పై అధికారులు సస్పెండ్ వేటు వేశారు. షాక్ ఇస్తూ సస్పెండ్ అయిన ఆ ఘటన చిన్నపాటి దొంగతనం..

దొంగ‌త‌నాల‌ను అరిక‌ట్టాల్సిన ఓ పోలీసే.. దొంగ‌త‌నం చేసి స‌స్పెండ్‌కు గుర‌య్యాడు. ఈ ఘ‌ట‌న పంజాబ్‌ లోని ఫ‌తేఘ‌ర్ సాహిబ్ టౌన్‌లో వెలుగు చూసింది. రోడ్డు ప‌క్క‌కు ఓ గుడ్ల వ్యాపారి గుడ్ల‌తో ఉన్న బండిని ఆపాడు. ఆ త‌ర్వాత అత‌ను ఏదో ప‌ని నిమిత్తం ప‌క్కకు వెళ్లాడు. అక్క‌డే ఉన్న ఓ హెడ్ కానిస్టేబుల్.. గుడ్ల బండి లో నుంచి గుడ్ల‌ను దొంగ‌త‌నం చేశాడు. కోడిగుడ్ల‌ను త‌న ఖాకీ యూనిఫాం పాయింట్ జేబుల్లో నింపుకున్నాడు. గుడ్ల వ్యాపారి అక్క‌డ‌కు రాగానే.. ఏమి తెలియ‌న‌ట్లు అటు నుంచి మెల్ల‌గా జారుకున్నాడు.

అటు వైపు వస్తున్న ఆటోలో ఎక్కి అక్కడనుండి మెల్లగా జారుకున్నాడు. ఈ త‌తంగాన్ని ఓ వ్య‌క్తి త‌న మొబైల్‌ లో చిత్రీక‌రించి వైర‌ల్ చేశాడు. గుడ్ల దొంగ‌త‌నాని కి పాల్ప‌డిన హెడ్ కానిస్టేబుల్‌ను ప్రీత్‌పాల్ సింగ్‌గా గుర్తించారు. హెడ్ కానిస్టేబుల్‌ను విధుల నుంచి పోలీసు ఉన్న‌తాధికారులు స‌స్పెండ్ చేస్తూ ఉత్త‌ర్వులు జారీ చేశారు. విచార‌ణ‌కు ఆదేశించారు. పది రూపాయల కోడి గుడ్ల కోసం పదివేల ఉద్యోగాన్ని పోగొట్టుకున్నదాన్ని నెటిజన్లు కామెంట్ల తోఆ వీడియో ను ట్రెండ్ చేశారు . ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది.. పోలీసులు ఈ వీడియో షాక్ అవుతున్నారు.. మీరు కూడా ఓ పారి చూసేయండి..

 


మరింత సమాచారం తెలుసుకోండి: