ప్రతి ఒక్కరికీ బీచ్ అంటే చాలా ఇష్టం ఉంటుంది. అక్కడికి స్నేహితులతోనో, ఫ్యామిలీతోనో వెళ్లి సరదాగా ఎంజో చేయాలని అనుకుంటూ ఉంటారు. బీచ్ లో ఉన్నప్పుడు సముద్రంలో ఉండే రకరకాల జీవులను చూస్తూ ఉంటాము మరియు వాటి గురించి తెలుసుకుంటాము. అయితే అప్పుడప్పుడూ మనకు కూడా తెలియని కొన్ని వింత వింత ఆకారాలతో కూడిన జీవులు అలా సముద్రపు ఒడ్డుకు వచ్చేస్తుంటాయి. ఇప్పుడు ఒక ప్రత్యేక జీవులు సముద్రం నుండి బయటకు కొట్టుకు వస్తున్నాయట. వాటిని చూసి అందరూ ఎంతో థ్రిల్ ఫీల్ అవుతున్నారట. తెలుస్తున్న సమాచారం ప్రకారం వాటిని శాండ్ డాలర్స్ అని పిలుచుకుంటున్నారు. అదేంటి డాలర్స్ అంటే డబ్బు కదా అని అనుకుంటున్నారా. అయితే దాని వెనుకున్న రహస్యమేమిటో తెలుసుకుందామా.

అగ్రరాజ్యం అమెరికాలో ఉన్న బీచ్ లకు వేలల్లో ఆ శాండ్ డాలర్స్ వస్తున్నాయని తెలుస్తోంది. సముద్రంలో నుండి వచ్చే సమయంలో జీవంతో ఉన్న ఈ శాండ్ డాలర్స్ ఒడ్డుకు రాగానే నిర్జీవమైపోతున్నాయని చెబుతున్నారు వీటిని చూసినవారు. వీటిపై సముద్ర శాస్త్రవేత్తలు పరిశోధన చేయడం మొదలెట్టారు. ఇవి ఒకరకమైన సముద్రంలో నివసించే చిన్న సైజు జీవులట.  ఇవి బిస్కెట్స్ లాగా చాలా చిన్నగా ఉండడంతో సీ కుకీస్ అని కూడా పిలుస్తారట. ఇవి నాణెము పరిమాణంలో ఉండడంతో వీటిని డాలర్స్ గా పిలుస్తున్నారు. అయితే ఈ శాండ్ డాలర్స్ ఎక్కువగా మధ్య, దక్షిణ, తూర్పు అమెరికా సముద్ర ప్రాంతాల్లో జీవిస్తాయట. వీటికి జీవించడానికి వేడి నీరు ఎక్కువగా ఉండాలని తెలుస్తోంది. సముద్రం కిందున్న జీవించే ఈ శాండ్ డాలర్స్ సముద్రంలో కలిగే ఆటుపోట్లు మరియు పెద్ద పెద్ద అలల కారణంగా ఒడ్డుకు కొట్టుకు వస్తాయి.

ఇలా వచ్చిన ఇవి బయట ఒక్క నిమిషం కంటే ఎక్కువ సేపు జీవించలేవట. చాలా పాపం కదా... ఎంతో హాయిగా జీవించే ఇవి అలల కారణంగా తమ జీవితాన్ని కోల్పోతున్నాయి. ఇప్పుడు ఈ వీడియోను సీసైడ్ ఆక్వేరియం ట్విట్టర్ ద్వారా పోస్ట్ చేసింది. అయితే ఇలా వేల సంఖ్యలో శాండ్ డాలర్స్ రావడానికి ఎటువంటి స్పష్టమైన ఆధారాలు లేవని వీరు చెబుతున్నారు. ఒడ్డుకు చేరిన ఇవి కోన ప్రాణంతో ఉన్నా కూడా తిరిగి సముద్రంలోకి వెళ్ళలేకపోతున్నాయని సీసైడ్ ఆక్వేరియం బృందం గుర్తించింది. అంతే కాకుండా ఇలా ప్రాణంతో ఉన్న శాండ్ డాలర్స్ ను ఎవ్వరూ ఇంటికి తీసుకెళ్ళద్దని హెచ్చరించింది. ఒకవేళ తీసుకెళితే అవి బ్యాడ్ స్మెల్ కలిగేలా చేస్తాయని తెలియచేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.

 



 
 

మరింత సమాచారం తెలుసుకోండి: