సోషల్ మీడియాను ప్రజలకు ఉపయోగపడేవిధంగా కనిపెడితే..కేటుగాళ్లు దాన్ని ఇతరులను మోసం చేయడనికి వాడేస్తున్నారు. పోర్న్ సైట్స్ అలవాటుపడ్డ కొందరు డైరెక్ట్ లైవ్ లో నగ్నంగా చాట్ చేసి బుక్కవుతున్నారు. ఇదే సందని మోసగాళ్లు అమాయకులను టార్గెట్ చేస్తూ కోట్లల్లో ధనార్జనను గడిస్తున్నారు. మోసం ఎక్కువరోజులు ఆగదు ఎప్పుడో ఒకప్పుడు బయటపడాల్సిందే. ఆన్లైన్ లో నగ్నంగా చాట్ చేసేందుకు ఇద్దరు భార్యాభర్తలు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఆలా ఒక వ్యక్తితో చాట్ చేస్తే నిమిషానికి 234 రూ.. అయితే ఆ రెండువందల్లో కొంత వెబ్ ఓనర్ కు మిగిలింది ఇద్దరు దంపతులు తీసుకునే వారు. అయితే ఈ ఆదాయంతో తృప్తి పడని దంపతులు వీళ్ళు ఎవరితో నైతే చాట్ చేశారో వారి డీటెయిల్స్ సేకరించి వారికీ తిరిగి ఫోన్ కాల్ చేసి మీ ..ఆ వెబ్సైటులో ఎక్కువమొత్తం లో చెల్లిస్తున్నారు .



మేము అతి తక్కువ ఛార్జ్ తో మీకు నాణ్యమైన వ్యక్తులతో చాట్ చేయిస్తామని చెప్పి వారిని ఒప్పించేవారు. అత్యాశకు పోయిన అమాయకులు దానికి ఒప్పుకుని చాట్ రూంకి వెళతారు. ఈ క్రమం లోనే వారు ఎదుటివ్యక్తులతో కూడా నగ్నంగా చాట్ చేసేలా వారిని ఉసిగొలుపుతారు. నమ్మి ఆలా వారు నగ్నంగా చాట్ చేసినట్లయితే వారు మోసపోయినట్లే వెంటనే వారికీ ఓ మగమనిషి ఫోన్ కాల్ చేసి మీ నగ్న వీడియోలు మాదగ్గర ఉన్నాయి. మాకు కావలసినంత డబ్బు మీరు చెల్లించకుంటే వెంటనే మీ వీడియోలను పోర్న్ సైట్ లో పెడతామని బెదిరిస్తారు. బెదిరిన అభాగ్యుల వారడిగిన డబ్బును వాళ్ళ ఖాతాలోకి జమచేస్తారు.

 

వివరాలలోకి వెళితే ఓ సీఏ కంపెనీకి చెందిన యజమాని తన కంపెనీ ఖాతా నుండి దాదాపు 80 లక్షలు తప్పుదోవపట్టాయని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు ఈ విషయమై దర్యాప్తు చేపట్టారు .ఈ దర్యాప్తులో వారు నమ్మలేనన్ని నిజాలు వారు కనిపెట్టారు. ఆ డబ్బులు తమ కంపెనీకి చెందిన ఓ ఉద్యోగస్తుడు ఆ 80 లక్షలను ఓ ప్రైవేట్ ఖాతాకు పంపినట్లు తెలుసుకున్నారు .వెంటనే అతడిని ఇంట్రాగేషన్ చేయగా అసలు విషయం వెలుగు చూసింది. యోగేష్ అనే వ్యక్తి ఆ డబ్బును తన ఖాతా   కు నుండి స్వీకరించినట్లు ఘజియాబాద్ పోలీసులు వెల్లడించారు.


మొదట ఈ కేసు ను గుజరాత్ లోని రాజకోట్ లో  కేసు నమోదు కాగా ఘజియాబాద్ పోలీసుల సహాయంతో రాజ్ కోట్ పోలీసులు ఛేదించారు. ప్రధాన  నిందితులైన ఘజియాబాద్ కు చెందిన దంపతులు స్వప్న గౌతమ్ , యోగేష్ లు ఓ ప్రైవేట్ పోర్న్ వెబ్ సిటీలో తమ సభ్యత్వాన్ని నమోదు చేసుకొని నిమిషానికి రూ. 234  చొప్పున నగ్న వీడియోలు చేయడానికి ఒప్పందం కుదుర్చుకున్నారు. అయితే వచ్చిన డబ్బులో సగం వెబ్ సైట్ నిర్వాహకులు తీసుకునేవారు. ఇలా కొంతకాలం చేసిన తరువాత వారికీ.. ఓ ఇతర దేశస్తుడు ఇచ్చిన సలహా మేరకు వారు ఎవరితో నైతే నగ్న చాట్ చేస్తారో వారి వివరాలను ,ఫోన్ నుంబర్లను , వాట్సాప్ మరియు ఇతర సోషల్ మీడియా వివరాలను సేకరించేవారు , ఈ పని కోసం యోగేష్ చాలానే కష్టపడ్డాడు.




 అయితే ఇలా వారి విషయాలను సేకరించిన తరువాత వీరే నగ్నంగా వీడియో కాల్ చేసేవారు. చేసి తమ దగ్గర తక్కువ మొత్తంలో వీడియోలు లభిస్తాయని చెప్పి నమ్మించేవారు, ఆలా నగ్నంగా చాట్ చేస్తూనే ఎదుటివారిని కూడా నగ్నంగా కనిపించమని కోరేవారు. ఇలా వారు చాట్ చేసినతరువాత వారికీ బెదిరింపు కాల్ చేసేవారు ...కొంత డబ్బు వారిదగ్గరనుండి బెదిరించి పొందేవారు.  ఈ పని కోసం ప్రత్యేకంగా యువతులను నియమించుకునేవారు. వారికీ ఒక్కొక్కరికి 25 వేలు జీతం నెలకుగాను ఇచ్చేవారు. అందులో మెస్సేజ్ లను   పంపేవారికి 15 వేలు ఇచ్చేవారు. ఇలా దాదాపు అమాయకప్రజలనుండి 22 కోట్లకు పైగానే  కొల్లగొట్టారు

మరింత సమాచారం తెలుసుకోండి: