
అయితే సాధారణంగా ఏ విషయం హాట్ టాపిక్ గా మారిన కూడా ఆ విషయం పై సోషల్ మీడియాలో ట్రోల్స్ ఫన్నీ వీడియోలు రావడం జరుగుతూ ఉంటుంది. ఇక ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారిన అంశం ఒక్కటే. అదే పెట్రోల్ ధరల పెరుగుదల. ఇక ఇప్పుడు పెట్రోల్ ధరల పెరుగుదలపై ఒక కామన్ మ్యాన్ ఎలా బాధ పడుతున్నాడు.. పెట్రోల్ ధర బాదుడు నుంచి ఎలా తప్పించుకోవాలని ప్రయత్నిస్తున్నాడు అనేది తెలుపుతూ ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎన్నో రకాల ట్రోల్స్ వీడియోలు కూడా వైరల్ గా మారిపోతున్నాయి. ఇటీవలే ఇలాంటి ఒక వీడియోనే వైరల్ గా మారిపోయింది. ఈ వీడియో అందరినీ కడుపుబ్బ నవ్విస్తుంది అనే చెప్పాలి.
ఇంతకీ ఈ వీడియోలో ఏముంది అంటారా.. ప్రస్తుతం పెట్రోల్ ధరల బాధల నుంచి తప్పించుకునేందుకు సామాన్యుడు ఎలా ఆలోచిస్తున్నాడు అనే విషయాన్ని కళ్లకు కట్టినట్లుగా ఈ వీడియోలో చూడవచ్చు. సాధారణంగా ఒక బైక్ పైన ఇద్దరు ప్రయాణించాలి.. మహా అయితే ముగ్గురు వెళ్తూ ఉంటారు.. కొన్ని కొన్ని సార్లు బైక్ మీద ఏకంగా నలుగురు ప్రయాణించడం లాంటివి కూడా అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం. కానీ ఇక్కడ ఒక అతను చేసిన ఆలోచన మాత్రం అంతకు మించి అనే రేంజ్ లోనే ఉంది. ఏకంగా బైక్ వెనుక భాగంలో ఒక మినీ బస్సులు తయారు చేశాడు సదరు వ్యక్తి. ఈ క్రమంలోనే ఒకే బైక్ ఫై ఫ్యామిలీ ఫ్యామిలీ మొత్తాన్ని తీసుకెళ్తున్నాడు. అయితే ఇది చూసిన నెటిజన్లు ప్రస్తుతం పెట్రోల్ ధరల పెరుగుదల చూస్తే ఇలాంటిది ట్రై చేయడం బెటర్ అని అంటున్నారు. కానీ ఇది చాలా రిస్క్ అని అనుకుంటున్నారు మరికొంతమంది.