సాధారణంగా మనం హెయిర్ కట్ చేయించుకోవడానికి సెలూన్ కు వెళ్ళిన సమయంలో కత్తెరతో కటింగ్ చేయడం చూస్తూ ఉంటాం. ఇలా కటింగ్ చేస్తున్న సమయంలో ఎవరైనా సరే కేవలం ఒకే కత్తెర ని చేతిలో పట్టుకొని కటింగ్ చేయడం కనిపిస్తూ ఉంటుంది. ఒకవేళ ఏదైనా డిఫరెంట్ గా ట్రై చేస్తే ఇక రెండు చేతుల్లో రెండు కత్తెరలు పట్టుకొని కటింగ్ చేస్తూ ఉంటారు. కానీ ఒకేసారి 28 కత్తెరలు చేతిలో పట్టుకుని కటింగ్ చేయడం గురించి ఎప్పుడైనా విన్నారా. ఒకేసారి 28 కత్తెరలు చేతిలో పట్టుకోవడం వరకు ఓకే కానీ అలా కటింగ్ చేయడం ఎలా కుదురుతుంది జోక్ వేస్తున్నారు కదా అని అంటారా..


 అలా అనుకున్నారు అంటే మాత్రం మీరు పప్పులో కాలేసినట్లే. ఎందుకంటే ఇక్కడ ఒక వ్యక్తి ఏకంగా రెండు చేతులలో 28 కత్తెరలు పట్టుకొని ఆ ఇరవై ఎనిమిది కత్తెరలతో కూడా కటింగ్ చేస్తూ ఉన్నాడు. ఇక దీనికి సంబంధించిన వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ఉజ్జయినిలోని ఆల్కా దాన్లో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఆదిత్య జైన్ అనే 26 ఏళ్ల యువకుడు బార్బర్ షాప్ పెట్టుకున్నాడు. 18 ఏళ్ల నుంచి ఇదే వృత్తిలో కొనసాగుతూ ఉన్నాడు. ఇక ఇదే వృత్తిలో కాస్త డిఫరెంట్ గా ట్రై చేసి రికార్డు కోసంట్టాలి అని అనుకున్నాడు. దీంతో ఇరవై ఎనిమిది కత్తెరలతో కటింగ్ చేయడం మొదలుపెట్టాడు. దీంతో ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చేరాడు. ఇంతకు పూర్వము ఇరవై రెండు కత్తెరలతో ఒక వ్యక్తి కటింగ్ చేసి ఇండియా బుక్ ఆఫ్ రికార్డుల్లో చోటు సంపాదించుకోగా.. ఇక ఇప్పుడు ఆదిత్య  ఇరవై ఎనిమిది కత్తెరలతో కటింగ్ చేసి ఆ రికార్డును బద్దలు కొట్టాడు.


 తాను సోషల్ మీడియాలో ఒక వీడియో చూశానని చైనాకు చెందిన వ్యక్తి 10 కత్తెరలతో కటింగ్ చేస్తున్నాడని... తర్వాత నేను సాధన చేయడం మొదలుపెట్టాను. ఆ తర్వాత ఇరవై రెండు కత్తెరలతో కటింగ్ చేస్తున్న వీడియో చూశాను.  ఆ రికార్డు బ్రేక్ చేయాలని ఇరవై ఎనిమిది కత్తెరలతో కటింగ్ చేయడానికి సాధన చేసాను. నాలుగు సంవత్సరాల పాటు సాధన చేసిన తర్వాత ఈ ఏడాదిలోనే విజయం సాధించా అంటూ ఆదిత్య చెబుతున్నాడు. ఇక ఇలా ఇరవై ఎనిమిది కత్తెరలతో కటింగ్ చేసిన  వీడియో తీసి దానిని ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్  నామినేషన్ కోసం పంపి ఇక రికార్డు సృష్టించా అంటూ చెబుతున్నాడు ఆదిత్య..

మరింత సమాచారం తెలుసుకోండి: