సాధారణంగా మనుషుల్లో ఉండే చాలా గుణాలు అటు జంతువులలో కూడా కనిపిస్తూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే. దారిలో వెళ్తున్నప్పుడు పక్కన ఏదైనా వస్తువు కాస్త వింతగా కనిపించింది అంటే చాలు ఆ వస్తువు ఏమై ఉంటుందా అని తెలుసుకోవడానికి మనుషులందరూ కూడా ఎక్కువగా ఆసక్తి చూపుతుంటారు. ఒకవేళ ఆ వస్తువు ఏమిటో తెలుసుకోకుండా అక్కడి నుంచి వెళ్లిపోయారు అంటే చాలు అతని మైండ్ లో అదే ఆలోచన మెదులుతూ ఉంటుంది. అచ్చంగా జంతువుల్లో కూడా ఇలాంటి స్వభావం ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఇక వెళ్తున్న దారిలో ఏదైనా కొత్తగా కనిపిస్తే అది ఎంటో అని తప్పకుండా దగ్గరికి వెళ్లి చూస్తూ ఉంటాయి.


 ఇక ఇలాంటివి ఇప్పటివరకు ఎన్నో విషయాలలో చూశామన్న విషయం తెలిసిందే. అయితే ఇక్కడ ఒక కుక్క ఒక గుర్రం పక్కనే గుండ్రటి ఒక గుడ్డు లాగా ఉన్నా దాన్ని చూసాయ్. దీంతో అది ఏంటో అని తెలుసుకోవాలి అని అనుకునీ ముందుగా కుక్క దగ్గరికి వెళ్లి చూడటం మొదలు పెట్టింది. కాస్త భయపడుతూనే వాసన చూసింది అనే చెప్పాలి. అదే సమయంలో అక్కడికి చేరుకున్న ఒక పెద్ద గుర్రం ఇక ఆ గుడ్డు లాంటి పాత్ర ఏంటో అని మరోసారి వాసన చూడటానికి వచ్చింది. కానీ ఒక్కసారిగా ఆ గుర్రం భయంతో బెంబేలెత్తి పోయింది  దీంతో అక్కడి నుంచి పరుగులు పెట్టింది. ఎందుకు  సంబంధించిన వీడియో కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది అని చెప్పాలి.


 ఇక ఈ వీడియో చూసిన తర్వాత నెటిజన్లు నవ్వు ఆపుకోలేక పోతున్నారు. ఇంతకీ అక్కడ గుండ్రటి గుడ్డు పాత్రలో ఉన్నది ఏంటో తెలుసా ఒక తాబేలు. సాధారణంగా తాబేలు చాలా నెమ్మదిగా కదులుతూ ఉంటుంది. ఇక ఏదైనా ప్రమాదం  వచ్చింది అని తెలిస్తే కాళ్లు చేతులు తల లోపలికి పెట్టుకొని ఉంటుంది. అయితే ఇటీవల తాబేలు ఇలా మైదానం లో కదులుతున్న సమయంలో దాని దగ్గరకు వచ్చాయి కుక్క గుర్రం. వాటిని చూసిన తాబేలు దాని తలను లోపల దాచుకుంది. దీంతో వింతగా కనిపిస్తుంది ఇది ఏంటా అని వాసన చూడటం మొదలుపెట్టాయి. ఇంతలో తాబేలు ఒక్కసారిగా కదిలింది. దీంతో దెబ్బకు భయంతో కుక్క గుర్రం రెండు పరుగులు పెట్టాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: