సోషల్ మీడియా అందరికీ అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రతి రోజూ లక్షల వీడియోలు సోషల్ మీడియాలో వస్తున్నాయి .ఇందులో కొన్ని వీడియోలు నెటిజన్ల మనసును తాకుతూ ఉంటాయి అని చెప్పాలి. ఈ క్రమంలోనే జంతువులకు సంబంధించిన వీడియోలు అయితే కేవలం నిమిషాల వ్యవధిలో సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోతూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే. ఎన్నో జంతువులు జాతులు వేరు అయినప్పటికీ ఒక జంతువు పై మరో జంతువు చూపించే ప్రేమ చూసినప్పుడు కల్మషం లేని ప్రేమ అంటే ఇదే కదా ఇలాంటి ప్రేమ మనుషుల్లో కనిపించడం లేదు అని ప్రతి ఒక్కరికి అనిపిస్తూ ఉంటుంది.


 ఇలా ఇప్పుడు ఇలాంటి తరహా వీడియో ఒకటి వైరల్ గా మారిపోయింది అని చెప్పాలి. సాధారణంగా సామరస్యంగా ఉండే జంతువులలో ఒంటె కూడా ఒకటి అన్న విషయం తెలిసిందే. ఎడారి ప్రాంతాలలో ఎక్కువగా నివసించే ఒంటె ఇక అప్పుడప్పుడు జనావాసాల్లోకి కూడా కనిపిస్తూ ఉంటాయి. ఒక భారీ ఒంటె కు సంబంధించిన వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.  ఈ వీడియో ప్రతి ఒక్కరి హృదయాన్ని తాకుతుంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అయితే ఇప్పుడు వరకు ఒంటె నడవడం, పరిగెత్తడం లేదా మనుషులను మోయటం మాత్రమే చూసి ఉంటారు.


 కానీ ఒంటెలు ఏకంగా ఇతర జంతువులపై కూడా ఎంతో అమితమైన ప్రేమను చూపిస్తాయి అన్నది ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది.. వైరల్ గా మారిపోయిన ఈ వీడియోలో చూసుకుంటే ఒక ఎడారి ప్రాంతంలో ఒంటె నిలబడి ఉంటుంది. అంతలో అక్కడికి చేరుకున్న ఒక కుక్క పిల్ల ఒంటెను చూసి మొరగడం ప్రారంభించింది. భయం భయంగానే ఆ ఒంటె దగ్గరికి వెళ్ళింది కుక్కపిల్ల.  పిల్లాడిని కన్నతల్లి చేరదీసినట్లుగానే ఆ ఒంటె ఆ కుక్క పిల్లను ఎంతో ప్రేమగా దగ్గరికి తీసుకుంది ఇది చూసి ఎంతో మంది నెటిజన్లు మైమరచిపోతూ ఉన్నారు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: