ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో పాములకు సంబంధించిన వీడియోలకు కొదవ లేకుండా పోయింది అని చెప్పాలి. ఒకప్పుడు జనావాసాల్లోకి పాము దూరింది అంటే చాలు ఎలాగైనా సరే ఆ పామును బయటకు తీసుకువచ్చి.. ఇక దాని ప్రాణాలను తీసేయడం లాంటివి చేసేవారు. ఇటీవల కాలంలో మాత్రం ఇలా జనావాసాల్లోకి పాము దూరింది అంటే ఏకంగా స్నేక్ క్యాచర్లకు సమాచారం ఇస్తూ ఉండడం చూస్తూనే ఉన్నాం. ఈ క్రమంలోనే ఇక సంఘటన స్థలానికి వచ్చి స్నేక్ క్యాచర్లు  ఎంతో చాకచక్యంగా పాములను పట్టుకుంటూ ఉంటారు.



 అయితే సాధారణ నాగుపాములకు సంబంధించిన వీడియోలు చూసినప్పుడు అందరికీ భయం వేస్తూ ఉంటుంది. అలాంటిది ఇక కింగ్ కోబ్రాలకు సంబంధించిన వీడియో ఏదైనా తెర మీదకి వచ్చిందంటే చాలు భయంకరమైన కింగ్ కొబ్రా రూపాన్ని చూడడానికి కూడా అందరూ మరింత భయపడిపోతూ ఉంటారు అని చెప్పాలి. కానీ ఎందుకో భయపడుతూనే కింగ్ కోబ్రా వీడియోలు చూడడానికి కాస్త ఆసక్తి కూడా చూపుతూ ఉంటారు. కింగ్ కోబ్రా ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన పాములలో ఒకటి. కేవలం దీని విషం మాత్రమే కాదు దీని ఆకారం కూడా అంతే భయంకరంగా ఉంటుంది.


 మిగతా త్రాచుపాములతో పోల్చి చూస్తే కింగ్ కోబ్రా భారీ సైజులో ఉంటుంది అని చెప్పాలి. ఇక వీటిని పట్టుకోవడం అటు స్నేక్స్ క్యాచర్లకు కూడా ఒక పెద్ద సవాల్ తో కూడుకున్నదే. ఇకపోతే ఇటీవల కింగ్ కోబ్రాని కొంతమంది స్నేక్ క్యాచర్లు కలిసి ఎంతో చాకచక్యంగా  పట్టుకున్నారు. ఏకంగా నీటి కుంట నుండి పారిపోయేందుకు ప్రయత్నించిన కింగ్ కోబ్రాను పట్టుకున్న వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. ఇది కాస్త వైరల్ గా మారిపోయింది. ఇది చూసిన ఎంతో మంది.. వామ్మో కింగ్ కోబ్రా ఎంత పెద్దగా ఉందో అంటూ కామెంట్లు చేస్తూ ఉండటం గమనార్హం. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ వీడియో చూసేయండి.

మరింత సమాచారం తెలుసుకోండి: