ఇటీవల కాలంలో జనాలు ఎలా తయారయ్యారు అంటే ఏమాత్రం ఏమరపాటుగా ఉన్న చివరికి బురిడీ కొట్టించి అందిన కాడికి దోచుకుపోవడమే టార్గెట్ గా పెట్టుకుంటున్నారు. ఇక ఇటీవల కాలంలో అయితే కొంతమంది కస్టమర్లు ఏకంగా షాపింగ్ కోసం వెళ్లి ఏదో ఒక విధంగా విలువైన వస్తువులను కొట్టేయడం లాంటి వీడియోలు కూడా సోషల్ మీడియాలో ప్రత్యక్షమవుతున్నాయి. సాధారణంగా అయితే మహిళలు షాపింగ్ మాల్ కి వెళ్ళినప్పుడు ఇక కొనేది తక్కువ అయినా చూసేది మాత్రం చాలా ఎక్కువ. షాప్ మొత్తం తిరిగేసి ఏదో ఒక చిన్న వస్తువు కొనుగోలు చేస్తూ ఉంటారు అని చెప్పాలి.


 ఇక కొంతమంది మహిళలు మాత్రం ఏకంగా అటు షాప్ లో ఉన్న సిబ్బంది ఏమరపాటుగా ఉన్న సమయంలో ఏదో ఒక విలువైన వస్తువును దాచుకొని ఇక కొట్టేయడం లాంటివి చేస్తూ ఉంటారు. ఇక్కడ ఒక యువతి ఇలాంటిదే చేసింది. ఇందుకు సంబంధించిన వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది అని చెప్పాలి. యువతి చేసిన నిర్వాకం గురించి తెలిసి నేటిజన్స్ అందరు కూడా షాక్ అవుతున్నారు. ఓ యువతీ తన స్నేహితులతో కలిసి గాజుల దుకాణానికి వెళ్ళింది. అయితే ఇక దుకాణ యజమానితో మాట్లాడుతూనే.. రెండు కాస్లి గాజులను కాళ్ల మధ్యలో పెట్టుకుంది అని చెప్పాలి.


 అవి చూపించండి... ఇవి చూపించండి అంటూ వివిధ ఐటమ్స్ ని బయటకు తీయించి అటు యజమానిని తిక్కమక పెట్టి ఇలా రెండు గాజులను కాళ్ల మధ్య పెట్టుకొని కొట్టేయాలి అని భావించింది సదరు యువతీ. ఇక అలాగే నిలబడే మరికొన్ని వస్తువులను కొట్టేసేందుకు అటు ఇటు చూస్తుంది. ఇలాంటి సమయంలోనే ఇక ఆమె వెనకాల కూర్చున్న ఒక వ్యక్తి ఇదంతా గమనిస్తూ ఇక సెల్ఫోన్ లో వీడియోలు తీశాడు. చివరికి సోషల్ మీడియాలో ఈ వీడియో షేర్ చేయడంతో వైరల్ గా మారిపోయింది అని చెప్పాలి. ఇది చూసిన తర్వాత ఈ వీడియో గనుక ఒకవేళ ఆ యువతీ చూసి ఉంటే మరోసారి ఇలాంటివి చేయదు అని నేటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: