
ఇలా బ్రేకప్ చెబుతున్న వారిలో కేవలం యువకులే మాత్రమే కాదండి ఎంతోమంది అమ్మాయిలు కూడా ఉన్నారు అని చెప్పాలి. ఇక మరికొన్నిసార్లు బ్రేకప్ చెప్పకుండానే ఒక్కరితో కాదు ఏకంగా ఇద్దరితో రిలేషన్ షిప్ లో కొనసాగడం లాంటివి చేస్తూ ఉన్నారు. దీంతోఇక ప్రేమించిన వారు మోసం చేశారు అన్న విషయం తెలిసి ఎంతో మంది సూసైడ్ చేసుకోవడానికి ప్రయత్నించడం కూడా చేస్తూ ఉంటారు. అయితే కేవలం మనుషుల్లోనే కాదు జంతువుల్లో కూడా ఇలాంటి ఎమోషన్స్ ఉంటాయి అన్నది ఇక్కడ వైరల్ గా మారిపోయిన వీడియో చూస్తే అర్థమవుతుంది.
ఇంతకీ ఇలా వైరల్ గా మారిపోయిన వీడియోలో ఏముందంటే రెండు పిల్లులు కలిసి ఒకచోట రొమాన్స్ చేసుకుంటూ ఉంటాయి. ఇంతలోనే అక్కడికి ఒక తెల్ల పిల్లి వస్తుంది. రొమాన్స్ లో మునిగిపోయిన పిల్లులను చూస్తుంది. అయితే ఆ రెండు పిల్లుల్లో ఒకదానికి అది లవర్ అన్నది తెలుస్తుంది. దీంతో ఇది గమనించిన నల్ల పిల్లి అక్కడ నుంచి పారిపోతుంది. అయితే ఇక తన లవర్ తనను మోసం చేసింది అని బాధపడిపోయిన పిల్లి ఏకంగా బస్ టైర్ కిందపడి ఆత్మహత్య చేసుకోవాలని అనుకుంటుంది. ఇదంతా వీడియోలో కనిపిస్తూ ఉంటే హుషారు సినిమాలోని నిన్నే నమ్మి చేశానే మోసం అనే బ్రేకప్ సాంగ్ బ్యాక్ గ్రౌండ్ లో వినిపిస్తుంది. దీంతో పిల్లులకు కూడా లవ్ ఫెయిల్యూర్ అవుతుందా అని ఇది చూసి అందరు షాక్ అవుతున్నారు.