ప్రస్తుతం సోషల్ మీడియా ప్రతి ఒక్కరికి అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో ఎక్కడ ఏ వింత ఘటన జరిగిన కేవలం నిమిషాల వ్యవధిలో సోషల్ మీడియాలో ప్రత్యక్షమవుతోంది అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఎన్నో రకాల వీడియోలు వైరల్ గా మారిపోతూ అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటాయి. మరి ముఖ్యంగా పాములకు సంబంధించిన వీడియోలు అయితే తెగ వైరల్ గా మారిపోతూ ఉంటాయి అని చెప్పాలి. సాధారణంగా పాములను నేరుగా చూడడానికి ప్రతి ఒక్కరు కూడా భయపడిపోతూ ఉంటారు.  కానీ సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యే వీడియోలలో చూడడానికి తెగ ఇష్టపడుతూ ఉంటారు అని చెప్పాలి.


 ఈ క్రమంలోనే ఇక ఇలా వైరల్ గా మారిపోయిన వీడియోలు చూస్తూ పాముల కదలికలు ఎలా ఉంటాయి.. ఎంత వేగంగా పాములు దాడి చేస్తాయి అన్న విషయాలను కూడా ఎంతోమంది తెలుసుకుంటూ ఉంటారు. అయితే కొంతమంది ఏకంగా సోషల్ మీడియాలో పాపులారిటీ సంపాదించడం కోసం ఇక విషపూరితమైన పాములతో ఆటలు ఆడుతూ వాటిని వీడియో తీసి ఇంటర్నెట్లో పెట్టడం లాంటివి చేస్తూ ఉంటారు అని చెప్పాలి. ఇప్పుడు వెలుగులోకి వచ్చిన ఘటన కూడా ఇలాంటి కోవలోకి చెందినదే. విషపూరితమైన పాముల్లో అత్యంత ప్రమాదకరమైనది కింగ్ కోబ్రా. అలాంటి కింగ్ కోబ్రా తో ఆటలు అంటే ప్రాణాల మీద ఆశలు వదులుకోవడమే. ఇక్కడ ఒక వ్యక్తి ఎంతో ప్రమాదకరమైన కింగ్ కోబ్రాతో ఆటలు ఆడాడు. ఏకంగా ప్రాణాలను పణంగా పెట్టి మరి కింగ్ కోబ్రా పడగ పైన ముద్దు పెట్టడానికి ప్రయత్నించాడు. ప్రయత్నించడమే కాదు ఎంతో విజయవంతంగా కింగ్ కోబ్రా పడగా పైన ముద్దు పెట్టాడు అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఈ వీడియో వైరల్ గా మారిపోయింది. అయితే ఈ వీడియో చూస్తుంటేనే ఎంత భయంకరంగా ఉంది.. ఇక అతను ఏకంగా నేరుగా పాముకి ఎలా ముద్దు పెట్టాడో అని అందరూ షాక్ అవుతున్నారు. నిజంగా నీ ధైర్యానికి హ్యాట్సాఫ్ గురు అని కొంతమంది నేటిజన్స్ కామెంట్లు చేస్తుంటే.. ఇంకొంతమంది ఇలాంటి పిచ్చి పనులు చేసి ప్రాణాలను పోగొట్టుకోవడం ఎందుకని తిట్టిపోస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: