సోషల్ మీడియా అనే మాయాజాలంలో ఎప్పుడు ఎన్నో వింతలు విశేషాలు తెరమీదకి వస్తూ ఉంటాయి. ఇక సోషల్ మీడియా పుణ్యమా అని కూర్చున్న చోటు నుంచే అరచేతిలో ఉన్న స్మార్ట్ ఫోన్తో ప్రపంచాన్ని మొత్తం చుట్టేసే అవకాశం ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులోకి వచ్చింది. ఇక ప్రపంచ నలుమూలలో ఎక్కడ ఏం జరిగినా కూడా కేవలం నిమిషాల వ్యవధిలోనే తెలుసుకోగలుగుతున్నారు ఇంటర్నెట్ కు అలవాటు పడ్డ జనాలు. ఈ క్రమంలోనే ఎప్పుడు ఎన్నో రకాల ఆసక్తికర ఘటనలు వెలుగులోకి వస్తూ హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటాయి.


 ఇక ఇలా వెలుగులోకి వచ్చే కొన్ని ఘటనలు అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తే మరికొన్ని ఘటనలు మాత్రం ఇక నవ్వుకునేలా చేస్తూ ఉంటాయి అని చెప్పాలి. ఇక ఇప్పుడు ఇలాంటి తరహా వీడియోనే ఒకటి వెలుగులోకి వచ్చింది. సాధారణంగా ఈ భూమి మీద ఉండే జీవులలో ఎలుకలకు పిల్లలనుంచి.. పిల్లులకు కుక్కల నుంచి ప్రాణహాని ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఇక ఈ రెండు జంతువులు ఎప్పుడు ఎదురుపడిన కూడా తక్కువ బలమున్న జంతువు ప్రాణం పోవడం ఖాయం. అచ్చం ఇలాగే అటు కప్పలకు పాముల నుంచి ప్రాణహాని ఉంటుంది. ఒకసారి పాములకు కప్పలు ఎదురుపడ్డాయి అంటే చాలు ఇక వాటి నుంచి ఆ కప్పులు తప్పించుకోవడం దాదాపు అసాధ్యం.


 కప్ప ప్రాణాల మీద ఆశలు వదులుకోవాల్సిందే. కానీ అప్పుడప్పుడు కొన్ని మిరాకిల్స్ వెలుగులోకి వస్తూ ఉంటాయి. చావు అంచుల వరకు వెళ్లిన జంతువులు మళ్ళీ క్షేమంగా బయటపడటం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు వెలుగులోకి వచ్చిన వీడియోలో ఇదే కనిపిస్తుంది. ఆకలితో ఉన్న ఒక పాము కప్పను మింగేయాలని చూస్తుంది. ఈ క్రమంలోనే ఆల్రెడీ నోటితో కప్పను పట్టుకుంది. ఇక కప్ప కూడా ప్రాణాలు పోయాయి అని ఆశలు వదిలేసుకుంది. కానీ చివరిగా ఒక ప్రయత్నం చేస్తుంది. ఇంతలో పాము పట్టు జారింది. ఇంకేముంది కప్ప అదే సమయాన్ని అదునుగా మార్చుకొని గేటు ఎక్కేసింది. చివరికి ప్రాణాలతో బయటపడింది.

మరింత సమాచారం తెలుసుకోండి: