గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సృష్టించాలని ఎంతో మంది ఎన్నో రకాలుగా ప్రయత్నిస్తూంటారు. అయితే వారిలో గెలిచిన వారు కొద్ది మంది మాత్రమే అయితే.. విఫలం అయిన వాళ్లు మాత్రం చాలా మంది ఉంటారు. అలా భారత దేశానికి చెందిన చాలా మంది కూడా గిన్నీస్ వరల్డ్ రికార్డును సృష్టించారు.చిన్న వయసు నుంచి పెద్ద వాళ్ల దాకా చాలా మంది ఉన్నారు. ఇప్పుడు ఇండియాకి చెందిన కేవలం ఓ 15 ఏళ్ల కుర్రాడు కూడా గిన్నీస్ రికార్డు సాధించాడు. అది కూడా మనం ఆడుకునే ప్లేయింగ్ కార్డ్స్ తో. చాలా మందికి కూడా ఈ ప్లేయింగ్ కార్డ్స్ గురించి తెలుసు. వాటి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఖాళీగా ఉన్నప్పుడు కొంత మంది సరదా కోసం ఆడుతూంటారు. కానీ కొంత మంది మాత్రం వీటిని జూదంగా తీసుకొని ఆడుతూంటారు.ఇక మనం చిన్నప్పుడు ప్లేయింగ్ కార్డ్స్ తో చిన్నగా బిల్డింగ్స్ కడుతూ ఉంటాం. ఇలా చాలా మంది ఆడే ఉంటారు. ఇంట్లో ప్లేయింగ్ కార్డ్స్ ఉంటే వాటితో సరదాగా బిల్డింగులు కడుతూ బాగా ఆనందించే వారు. అయితే కొంచెం గాలి వేసినా, ఒక వేలు ఆనించినా మొత్తం పడిపోయేది.ఎందుకంటే అవి చాలా లైట్ వెయిట్ కలిగి ఉంటాయి కాబట్టి. 


ఇప్పుడు అలాంటి వాటితో ఈ కుర్రాడు గిన్నీస్ రికార్డు సాధించాడు. ఇంతకీ అతను ఏం చేశాడో ఇప్పుడు మనం తెలుసుకుందాం. కోల్ కతాకు చెందిన అర్నవ్ అనే 15 ఏళ్ల కుర్రాడు గిన్నీస్ వరల్డ్ రికార్డును సాధించాడు. కోల్ కతాకు చెందిన నాలుగు రకాల భవన నిర్మాణాలను ప్లేయింగ్ కార్డ్స్ తో అతను చక్కగా తయారు చేశాడు.ఏకంగా 41 రోజుల పాటు ఈ భవన నిర్మాణాలను తయారు చేసి.. అతను మొత్తాన్ని వరల్డ్ రికార్డును బద్దలు కొట్టాడు. అర్నవ్ రూపొందించిన భవనాలు 11 అడుగుల పొడవు, నాలుగు అంగుళా ఎత్తు, 16 అడుగులు ఇంకా 8 అంగుళాల వెడల్పుతో అతి పెద్ద ప్లేయింగ్ కార్డ్ స్ట్రక్చర్ గా రూపొందించి ప్రపంచ రికార్డును సాధించింది. బైగాన్ బెర్గ్ సృష్టించిన రికార్డ్ ను ఈజీగా బద్దలు కొట్టాడు. రైటర్స్ బిల్డింగ్, షహీద్ మినార్, సాల్ట్ లేక్ స్టేడియం ఇంకా సెయింట్ పాల్స్ కేథడ్రల్ వంటి ప్రతి రూపాలను నిర్మించడానికి అర్నవ్ 1,43,000 కార్డులను అతను ఉపయోగించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: