మరికొన్ని ఘటనల్లో వన్యప్రాణులు పాడి పశువులు కూడా ఏకంగా రహదారుల మీదికి వచ్చి చివరికి ప్రమాదాలకు కారణమవుతూ ఉన్నాయి అని చెప్పాలి. అయితే ఇలాంటి ప్రమాదాలకు సంబంధించిన ఎన్నో వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోతూ ఉంటాయి. ఇలాంటి వీడియోలు చూసి అక్కడ జరిగిన యాక్సిడెంట్ తో అందరూ ఒక్కసారిగా ఉలిక్కిపడతారు అని చెప్పాలి. ఇప్పుడు వెలుగులోకి వచ్చిన ఘటన కూడా ఇలాంటి కోవలోకి చెందినదే. 110 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోతున్న కారు రోడ్డు మీద ఆగి ఉన్న ఒక గేదెను ఢీ కొట్టింది. ఈ ఘటన కర్ణాటకలో వెలుగులోకి వచ్చింది.
అయితే ఈ యాక్సిడెంట్ కి సంబంధించిన విజువల్స్ మొత్తం కారులోని డాష్ బోర్డు కెమెరాలో రికార్డు అవడంతో ఇది కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. కర్ణాటకలో నాలుగు లైన్ల రహదారిపై కియా సెల్తోస్ కారు 110 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. అయితే కారు హైబీన్ హెడ్లైట్లు కూడా ఆన్ లోనే ఉన్నాయి. కొంచెం దూరం వెళ్లగానే ఒక గేద అడ్డు రావడంతో.. డ్రైవర్ సడన్ బ్రేక్ వేసేందుకు ప్రయత్నించాడు. కానీ అప్పటికే కాలు నియంత్రణ కోల్పోవడంతో అతివేగంతో గేదెను ఢీకొట్టింది. ప్రమాదంలో కారును ఫల్టీలు కొట్టింది. అయితే సమయానికి ఎయిర్ బ్యాగులు తెరుచుకోవడం.. ఇక అందులో ఉన్న వారందరూ సీట్ బెల్టులు పెట్టుకోవడంతో చిన్న గాయాలతో బయటపడ్డారు. ఈ ఘటనలో గేదె ప్రాణాలు కోల్పోయింది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి