మనుషులు విస్తరిస్తున్న కొద్ది అడవులు చాలా చోట్ల కనుమరుగవుతున్నాయి.. అలాగే జంతువులను కూడా చాలా చోట్ల చంపితింటూ ఉండడం వల్ల తగ్గిపోతున్నాయి. ప్రకృతి మీద ఆధారపడి జంతువులు మరో మార్గం లేక జనావాసాల మధ్యలోకి రావడం మొదలుపెట్టాయి. దీంతో జంతువుల మధ్య అలాగే మనుషుల మధ్య ఒక విధమైనటువంటి ఘర్షణలు ఏర్పడుతున్నాయి.. మరి కొందరేమో కావాలనే క్రూర మృగాలని రెచ్చగొడుతూ పీకల మీదకు తెచ్చుకుంటున్నారు.. ఇలాంటి పరిస్థితులలో తిరగబడ్డ క్రూర జంతువులని సైతం మట్టు పెట్టాల్సి వస్తోంది. ఈ పరిస్థితిని చూసి ఆవేదన వ్యక్తం చేస్తూ IFF ఆఫీసర్ పర్వీస్ కాస్వాన్ షేర్ చేసిన ఒక వీడియో సోషల్ మీడియాలో షేర్ చేయడం జరిగింది.

అయితే ఈ  వీడియో అస్సాంలో జరిగినట్టు తెలుస్తోంది. వీడియోలో కనిపిస్తున్న దాని ప్రకారం..అడవిఏనుగు ఏదో కారణంగా కొంతమంది యువకుల మీదకు దూసుకుపోతున్నట్లుగా  కనిపిస్తోంది..వారు కొంత దూరం పరిగెత్తగానే ఏనుగు వెనక్కి తిరిగి వెళ్ళిపోతూ ఉండగా.. కొంతమంది యువకులు మాత్రం మూర్ఖత్వంతో రెచ్చిపోయి వెనక్కి వెళ్ళిపోతున్న ఏనుగును చెప్పుతో బెదిరిస్తూ ఆ ఏనుగు వెనకాల పరిగెత్తే ప్రయత్నం చేశారు. ఆ ఏనుగును ఎంతగా రెచ్చగొట్టాలో అంతగా రెచ్చగొట్టినట్టుగా కనిపిస్తోంది. చేసేదేమీ లేక ఏనుగు మళ్లీ వెనక్కి తిరిగి వారిని వెంబడించే ప్రయత్నం చేసింది..వాళ్ళు పారిపోవటంతో ఏనుగు సైలెంట్ అయింది.

ఈ వీడియోను పోస్ట్ చేసిన అటవీ అధికారి ఆ  యువకుల తీరును విమర్శించాడు.. అడవి జంతువులు చాలా అమాయకమైనవి.. ఇలా రెచ్చగొట్టడం భావ్యమా అంటు ప్రశ్నిస్తున్నారు.. ఒకవేళ అవి తిరగబడి మిమ్మల్ని చంపితే వాటిపైన క్రూరమైన మృగాలు అంటూ ముద్ర వేస్తారంటూ ఆవేదనను వ్యక్తం చేస్తూ తెలియజేశారు అందుకే అడవి జంతువులు కనిపిస్తే కాస్త దూరంగా అయినా వెళ్ళండి అంటూ తెలుపుతున్నారు. ఇలాంటి వాటిని బెదిరించడం రెచ్చగొట్టడం వంటివి చేస్తే మీ ప్రాణాలకే ప్రమాదం అంటూ ఆ ఫారెస్ట్ ఆఫీసర్ హెచ్చరిస్తున్నారు. దీంతో పలువురు నెటిజన్లు ఈ విషయాన్ని ఏకీభవిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: