చాలామంది జాబ్ చేసేవాళ్లు ఉంటారు. అలా భర్త భార్య ఇద్దరు జాబ్ చేస్తుంటే పుట్టిన పిల్లల్ని ఉద్యోగరీత్యా దగ్గర్లో ఉన్న డే కేర్ సెంటర్లో వదిలి వెళ్తూ ఉంటారు. అయితే డేకేర్ సెంటర్లలో డబ్బులు కడుతూ పిల్లల్ని వచ్చేవరకు లాలించమని,ఆడించమని చెబుతూ ఉంటారు. కానీ ఈ డేకేర్ సెంటర్లో ఉండే పని మనుషుల నిర్వాకం చూస్తే మాత్రం కన్నీళ్లు పెట్టుకోవాల్సిందే. అయితే అందరూ అలా ఉంటారని కాదు కొంతమంది అయితే కచ్చితంగా ఇలాంటి వాళ్ళు ఉంటారు. అయితే తాజాగా ఉత్తరప్రదేశ్ నోయిడాలో ఉండే  డే కేర్ సెంటర్లో పనిచేసే పనిమనిషి ఓ 15 ఏళ్ల పాప పట్ల ఎంత కర్కశంగా వ్యవహరించిందో సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతుంది. ఆ వీడియో చూసి చాలామంది కన్నీళ్లు పెట్టుకుంటున్నారు.మరి ఇంతకీ ఆ వీడియోలో ఏముందంటే.. డేకర్ సెంటర్లో చిన్న పిల్లని ఆడిస్తున్న ఓ పనిమనిషి ఒక 15 నెలల పాపని ఎత్తుకొని అటు ఇటు తిప్పింది. 

కానీ ఆ చిన్నారి ఎంతకూ ఏడవడం ఆపకపోయే సరికి కోపంతో ఆమెను రెండుసార్లు నేల మీద ఎత్తేసింది.అలాగే ఆ చిన్నారి తలని గోడకేసి బాధింది.అంతటితో ఆమె కోపం చల్లారలేదు. ఏడుస్తూ ఉన్న పాప చెంపలు వాయించింది.కాసేపు ఆడిస్తున్నట్లుగా ఆడించి పాప ఏడుపు ఆపకపోవడంతో బ్యాట్ తో తొడలు వాయించిది.అయితే సాయంత్రం కావడంతో తల్లిదండ్రులు ఆ పాపని ఇంటికి తీసుకువెళ్లారు. ఇంటికి తీసుకువెళ్లాక పాప డ్రెస్ విప్పి చూడగా ఒళ్లు కమిలిపోయినట్లుగా ఎర్రని వాతలు ఉండడంతో ఇదేంటి అని ఆశ్చర్యపోయి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లడంతో డాక్టర్లు పాపను చూసి ఇవి ఎవరో కొట్టిన దెబ్బల్లాగా ఉన్నాయని చెప్పడంతో డేకేర్ సెంటర్ కి వెళ్లి సిసిటివి ఫుటేజ్ చూడగా పనిమనిషి చేసిన నిర్వాకం బయటపడింది.

 అయితే పనిమనిషి తన కూతురు పట్ల వ్యవహరించిన తీరును చూసి పేరెంట్స్  ఇద్దరు షాక్ అయ్యి కన్నీళ్లు పెట్టుకున్నారు. అంతేకాదు స్థానికంగా ఉండే పోలీసులకు డే కే సెంటర్ నడిపించే వ్యక్తిపై ఆ పనిమనిషిపై ఇద్దరిపై కేసు నమోదు చేశారు. ఇక ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో చాలామంది నెటిజెన్లు ఆ పని మనిషి పై మండిపడుతున్నారు. తల్లిదండ్రులు పిల్లల భవిష్యత్తు కోసం డబ్బులు సంపాదించాలని డే కేర్ సెంటర్లో వదిలీ వెళ్ళిపోతే మీరు చేసే నిర్వాకం ఇలా ఉందా..జీతం తీసుకుంటున్నావు కదా.. పాపని ఆమాత్రం ఆడించలేవా.. అయినా నోరులేని చిన్న పిల్లలు ఏడుస్తున్నారంటే వారికి ఏదో ఇబ్బందే అయి ఉంటుంది. ఆ మాత్రం గమనించలేవా. ఆ చిన్నపిల్లను కొట్టడానికి నీకు చేతులేలా వచ్చాయి అంటూ ఆ పనిమనిషి పై మండిపడుతున్నారు. ఏది ఏమైనప్పటికీ ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారడంతో చాలామంది పేరెంట్స్ డే కేర్ సెంటర్ అంటేనే భయపడిపోతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: