ఈ మధ్య కాలంలో చాలా మంది చేసిన పనిలో సక్సెస్ అయితే ఒక విధంగా ఫెయిల్ అయితే మరో విధంగా ప్రవర్తిస్తున్నారు. సక్సెస్ అయితే తాను పడ్డ కష్టానికి ఫలితం లభించిందని... ఎంతో కష్టపడి సక్సెస్ అయ్యానని చెప్పేవారు ఫెయిల్ అయితే మాత్రం ఇతరులపై ఆరోపణలు చేస్తూ ఉంటారు. ప్రస్తుత సమాజంలో ఎదుటి వ్యక్తులను బాధ్యులుగా చేసేవారు చాలామంది ఉంటారు. మంచి ఫలితం వస్తే ఒక విధంగా చెడు ఫలితం వస్తే మరో విధంగా ప్రవర్తిస్తూ ఉంటారు. 
 
ఇలాంటి ధోరణి ఉన్నవాళ్లు సక్సెస్ ను అంత సులభంగా పొందలేరు. జీవితంలో ఎల్లప్పుడూ అన్ని ఫలితాలకు మనం బాధ్యత తీసుకుంటే మాత్రమే సక్సెస్ సాధించడం సాధ్యమవుతుంది. మన ఫెయిల్యూర్ కు ఇతరులపై ఆరోపణలు చేయడం ద్వారా ఎలాంటి ప్రయోజనం ఉండదు. బాధ్యతలను ఎల్లప్పుడూ బలంగా భావించాలి. మన బాధ్యతలను మనం సక్రమంగా పూర్తి చేస్తే జీవితంలో సక్సెస్ అవుతామని గుర్తుంచుకోవాలి. 
 
మనం బాధ్యతలను సక్రమంగా నెరవేర్చకుండా అవతలి వ్యక్తులపై ఆరోపణలు చేస్తే మాత్రం మనమే ఎక్కువగా నష్టపోయే అవకాశం ఉంది. మరికొంతమంది బాధ్యతలను స్వీకరించడానికి భయపడుతూ ఉంటారు. కష్టపడి పని చేయడానికి ఇష్టపడకుండా సమయాన్ని వృథా చేయడానికి ప్రాధాన్యత ఇస్తారు. జీవితంలో విలువైన సమయాన్ని వృథా చేసి ఆ తరువాత బాధ పడతారు. 
 
జీవితంలో ఏ పని చేసినా కొన్ని సందర్భాల్లో సక్సెస్ మరికొన్ని సందర్భాల్లో ఫెయిల్యూర్ కచ్చితంగా వస్తుంది గెలుపు వచ్చినప్పుడు పొంగిపోకుండా ఫెయిల్యూర్ వచ్చినప్పుడు కృంగిపోకుండా జీవితంలో ముందడుగు వేయాలి. అలా కష్టపడి అనుకున్న లక్ష్యాలను సాధిస్తే ఏ పనిలోనైనా విజయం సొంతమవుతోంది. బాధ్యతలను చూసి భయపడితే జీవితంలో ఎప్పటికీ ఉన్నత స్థానాలకు చేరుకోవడం సాధ్యం కాదు. అందువల్ల బాధ్యతలను స్వీకరిస్తూ... ఆ బాధ్యతలకు తగిన న్యాయం చేస్తూ జీవితంలో సక్సెస్ సాధించాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: