ఏదైనా పని తలపెట్టే ముందు ఆ పనిని గురించి పూర్తిగా తెలుసుకోవాలి. అప్పుడే ఆ పనిని సమర్థవంతంగా బాగా పూర్తి చేయగలం. ఎప్పుడైతే మనకు సదరు పని గురించి పూర్తిగా అవగాహన ఉంటుందో అప్పుడు మనం దానిని చెయ్యగలం. అందుకే ముందు మనం తలపెట్టాలన్న పనిని గురించి అవగాహన పెంచుకోవాలి, పూర్తి వివరాలు తెలుసుకోవడానికి ప్రయత్నించాలి. ఏ పని అయినా చేయడానికి ముందు మన సొంత బలాన్ని, బలహీనతలను అర్థం చేసుకోవాలి. అప్పుడే ఆ పని లేదా ఆ లక్ష్యాన్ని మనం అనుకున్నట్టుగా పూర్తి చేయగలం, సాధించగలం. మనల్ని మనం చెక్ చేసుకోవాలి. ఇంతకీ ఆ అంశాలు ఏమిటంటే.. మన బలాలు, బలహీనతలను, అలాగే మన ప్రతిభ, మన సామర్థ్యం వీటిపై ఒక అంచనా ఉండడం ద్వారా మన లక్ష్యాన్ని ఎంపిక చేసుకోవడంలో మంచి జరుగుతుంది.

ఎటువంటి పనిని లేదా లక్ష్యాన్ని ఎంచుకోవాలో మనకు ఒక ఐడియా వస్తుంది. ఆ తర్వాత ఆ అంశం లోని లోతు, పల్లాలు తెలుసుకోగలిగితే...విజయాన్ని అందుకోవడం అంత కష్టమేమీ కాదు. మన బలాలు తెలుసుకోగలిగితే ఎదురయ్యే సవాళ్లను ఎంత వరకు అధిగమించగలరు అన్న అంచనా వేయగలం, తద్వారా మార్గం సులభమవుతుంది. ఏ వ్యక్తి అయితే తనలోని బలాలను, బలహీనతలను, దాగున్న సామర్ధ్యాలను తెలుసుకుని తనలోకి చూసుకో గలుగుతాడో, అలాంటి వారు సులభంగా సక్సెస్ అవుతారు. మనము ఇందులో బెస్ట్ అనేది తెలిస్తే ఏ విధమైన ప్రణాళికను చేసుకోవాలో తెలుస్తుంది.

ఇదే కాకుండా మనము ఇందులో లక్ష్యాన్ని చేధించే లేదా అందుకునే క్రమంలో అవసరమయిన ఇందులో బలహీనంగా  ఉన్నామో దానిని పెంపొందించుకోవాలి. ఈ విధంగా బలాలు మరియు బలహీనతలను బ్యాలన్స్ చేసుకుంటూ లక్ష్యం వైపు అడుగులు వేయాల్సిన అవసరం ఉంది. చాలా మంది ఈ విషయంలో కూడా తప్పులు చేస్తూ ఉంటారు. మన బలమేమిటో తెలుసుకోకపోతే అసలు టార్గెట్ ను ఎలా చేధించగలము. కాబట్టి ఎవ్వరైనా తొలిదశలోనే ఈ విషయం పట్ల సరైన అవగాహన పెంచుకోవాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: