మనకు లభించిన ఈ చిన్న జీవితంలో సుఖంగా సంతోషంగా ఉండాలి అంటే అంత సులభం కాదు. దానికి మన మనసు అన్ని విధాలుగా సిద్దంగా ఉండాలి. సమాజంలో మనకు ఏది జరిగినా పాజిటివ్ గా తీసుకునేందుకు సిద్దంగా ఉండాలి. అంతే కానీ మనకు అన్నీ కలిసి వచ్చి డబ్బులు ఉన్నప్పుడు ఒక విధంగా, ఏమీ లేనప్పుడు కష్టాలు వచ్చి సర్వం కోల్పోయినప్పుడు ఒక విధంగా ఉంటే కరెక్ట్ కాదు. అయితే కష్టాలు కలిగినప్పుడు ఒక విషయం మాత్రం ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి. ఎవరైనా ఏదో ఒక పరిస్థితిలో టైం బాగా లేక కష్టాలు పాలవుతారు. ఇది సహజం, అంత మాత్రాన మీ జీవితం కోల్పోయినట్లు కాదు. లేదా మీరు జీవితంలో ఓడినట్లు అసలే కాదు.

మీ యొక్క ఆత్మస్థైర్యం మరియు మనోబలం ఎలా ఉందో, ఎంత ఉందో చెక్ చేయడానికి ఆ భగవంతుడు కొన్ని పరీక్షలు పెడతాడు. వాటిలో నెగ్గుకు వస్తేనే జీవితంలో ఏదైనా సాధించగలరు. కొందరు అయితే కష్టాలు కలిగినప్పుడు బాగా కృంగిపోతారు. మరి కొందరు కష్టాలు వచ్చినప్పుడు ఎవరో వచ్చి ఏదో చేస్తారని ఎదురు చూస్తుంటారు. కానీ వాస్తవంగా చూస్తే నీ కష్టాలను ఎవ్వరూ తీర్చలేరు. మరియు నువ్వు కష్టాల కడలిలో పడిపోతే లేపడానికి ఎవ్వరూ ముందుకు రారు సరికదా నీతో మానసికంగా ఆడుకుంటారు. హేళన చేస్తారు.

అయితే అలంటి వారందరికీ ఒక గుణపాఠం చెప్పాలంటే, మీరు ఎంత కష్టాల్లో ఉంటారో... అంతే ఓపికగా అన్నింటినీ ఓర్చుకుని... నెమ్మది నెమ్మదిగా మళ్ళీ ఒక్కో ఇటుక పేర్చుకుంటూ బలపడాలి. అప్పుడే మీ యొక్క బలం ఏమిటో మీ శత్రువులకు మరియు మిమ్మల్ని చూసి నవ్వినా వారికి ఒక జవాబు చెప్పినవారు అవుతారు. అది వదిలేసి పడిన దగ్గరే ఉంటూ సాయం కోసం ఎదురుచూడడం వలన ఉపయోగం ఉండదు.  

మరింత సమాచారం తెలుసుకోండి: