వర్షా కాలం వచ్చేసరికి అంటు వ్యాధులు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి.  ఈ కాలంలోనే ప్రజలు తమను తాము ఎక్కువగా చూసు కోవడం ప్రారంభిస్తారు.ముఖ్యంగా ఈ సీజన్‌లో గర్భిణీ స్త్రీలు తమను తాము ఎక్కువగా చూసుకోవాలి.కడుపులో బిడ్డ ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని జాగ్రత్తగా ఉండాలి. వర్షా కాలంలో గర్భిణీలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకోండి.. !!వర్షా కాలంలో, గర్భిణీ స్త్రీలు చాలా శుభ్రంగా ఉండాలి. శుభ్రమైన మంచి నీటిని మాత్రమే తాగాలి. వీలైతే, ఫిల్టర్ చేసిన నీటిని వాడండి.



అలాగే వర్షా కాలంలో వీలయినంత వరకు వీధి ఆహారాన్ని మానుకోండి. ఇది తల్లికి, కడుపులోని బిడ్డకి ఇద్దరికి హానికరమే.ఈ సమయంలో, మహిళలు తమ పరిసరాలతో పాటుగా, ఇంటిని కూడా శుభ్రంగా ఉంచుకోవాలి. అపరిశుభ్రత అనేది  గర్భిణీ స్త్రీతో పాటు ఆమె బిడ్డకు కూడా ప్రాణాంతకం. ముఖ్యంగా వర్షా కాలంలో చాలా శ్రద్ధ పెట్టాలి.అంతే కాకుండా వర్షా కాలంలో వాన నీరు అనేది నిల్వ ఉంటుంది
అందుకనే  జారే ప్రదేశాలకు వెళ్లడం కూడా మానుకోవాలి.




వర్షం లేదా మరేదైనా సీజన్. గర్భిణీ స్త్రీలు ధరించడానికి సౌకర్యవంతమైన దుస్తులను ఎంచుకోవాలి.ప్రధానంగా  
గర్భిణీ స్త్రీలు వర్షా కాలంలో కూడా వారి శరీరంపై శ్రద్ధ వహించాలి.వర్షా కాలంలో, మీరు కొన్ని కారణాల వల్ల బయటికి వెళ్లి తడిచి వస్తే మీరు ఇంటికి వెళ్లి వెంటనే మీ శరీరం, జుట్టును పూర్తిగా తుడిచి ఆరబెట్టు కోవాలి. ఏ మాత్రం స్వల్ప అజాగ్రత్త అయిన మీకు ప్రాణాంతకం అవ్వవచ్చు. అలాగే దోమలు ఎక్కువగా వచ్చే కాలం ఇదే కాబట్టి ఎంతో జాగ్రత్తగా ఉండాలి.ఈ కాలంలో చల్లటి నీళ్లు తాగడం అంత మంచిది కాదు.. జలుబు, దగ్గు వచ్చే ప్రమాదం ఉంది..పై జాగ్రత్తలు అన్ని పాటిస్తూ ఉంటే మీరు, మీ బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉంటారు.. !! అందుకనే జాగ్రత్త అవసరం.

మరింత సమాచారం తెలుసుకోండి: