భారత సైన్యంలో లెఫ్టినెంట్ కల్నల్ హోదా సాధించిందో అమ్మాయి. ఆమె పేరు పోనంగ్‌ డోమింగ్‌. భారత సైన్యంలో ఆమె ఒక ఆశా రేఖ. ఇటీవల మన సైన్యంలో లెఫ్టినెంట్‌ కల్నల్‌ హోదాకి ఎదిగిన ఆమె ఆ హోదాను సాధించిన అరుణాచల్ ‌ప్రదేశ్‌ రాష్ట్రానికి చెందిన తొలి మహిళగా రికార్డు సృష్టించింది. భారత సైన్యంలో లెఫ్టెనెంట్‌ కల్నల్‌ హోదా పొందిన పోనంగ్‌ డోమింగ్‌ అరుణాచల్‌ ప్రదేశ్‌ వాసి. ఆ రాష్ట్రం నుంచి ఈ హోదా పొందిన తొలి మహిళ పోనంగ్‌. ఆమె సాధించిన ఈ అపూర్వ విజయంపై పలువురు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

‘పోనంగ్‌ చరిత్ర సృష్టించింది. ఇవి మనం అందరం గర్వించదగ్గ క్షణాలు’ అంటూ స్వయంగా ఆ రాష్ట్ర ముఖ్య మంత్రి పేమా ఖాండు సైతం ట్వీట్‌ చేసింది. ఇలా సీఎం కూడా తన ఆనందాన్ని వ్యక్తం చేసిందంటే ఆమె విజయం ఎంత గొప్పదో తెలిసి పోతుంది. సైన్యంలో మహిళలను ఆఫీసర్‌ ర్యాంకుల్లో  తీసుకుంటున్నారు. గత ఏడాది దీనిపై  ప్రభుత్వం పార్లమెంటులో ప్రకటన కూడా చేసింది. భారత సైన్యంలో మహిళా ఆఫీసర్లు 3.80 శాతం ఉంటే, నౌకా దళంలో మహిళా అధికారులు ఆరు శాతం ఉన్నారు. ఇక వైమానిక దళం విషయానికి వస్తే.. ఇక్కడ 13.9 శాతం మహిళా అధికారులు ఉన్నారు.

పోనంగ్‌ కూడా సైన్యంలో తొలుత మహిళా అధికారిగానే జాయిన్ అయ్యారు. మహిళలు ఈ రంగంలో ఆఫీసర్ల హోదాకే  పరిమితమైపోయారు. కానీ పోనంగ్‌ డోమింగ్ మాత్రం పట్టుదలతో‌ లెఫ్టినెంట్‌ కల్నల్‌ ర్యాంకుని పొందింది. ఇది కచ్చితంగా ఎంతో మంది స్త్రీలకు స్ఫూర్తినిచ్చే విషయమని నిపుణులు అంటున్నారు. తనకు ఈ హోదా లభించడంతో పోనంగ్‌ ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి. తనను వరించిన ఈ హోదాపై పోనంగ్‌ మనసారా తన సంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ పదోన్నతితో దేశం పట్ల తన బరువు బాధ్యతలు మరింత పెరిగాయని పోనంగ్‌ అంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి: