ప్రపంచంలో ప్రతి ఒక్కరినీ ఇబ్బంది పెట్టిన వ్యాధి కరోనా.. దీనివల్ల యావత్ ప్రపంచం స్తంభించిపోయింది.. ఒక టైంలో ప్రపంచం అంతమైపోతుందన్న సందేహం కూడా కలిగింది.. మన దేశంలోనే కాదు ప్రపంచ మొత్తం కూడా లాక్ డౌన్ అనే పద్ధతిని ప్రవేశ పెట్టి ఈ మహమ్మారిని పారద్రోలాలని ప్రయత్నం చేశారు.. ఇందులో దాదాపు సగం వరకు సక్సెస్ అయినా మళ్లీ ఇప్పుడు రెండో దశ రూపంలో ఈ మహమ్మారి మళ్లీ ఈ ప్రపంచాన్ని వణికిస్తోంది.. ఇంత క్లిష్ట పరిస్థితుల్లో కూడా గుడ్ న్యూస్ ఏమిటంటే ఈ మహమ్మారి వ్యాక్సిన్ ని కనిపెట్టడం..

మొదటి దశలో ఈ మహమ్మారిని ఎదుర్కొనేందుకు మన దగ్గర సరైన ఆయుధం లేదు కానీ రెండోదశలో సరైన ఆయుధం ఇప్పుడు వ్యాక్సిన్ రూపంలో మన చేతిలో ఉంది.. ఇప్పటివరకు 40 ఏళ్ల పైబడిన వారు ఈ వ్యాక్సిన్ ని రెండు దశలుగా అందుకోగా, ఈ మే 1 నుంచి 18 సంవత్సరాలు పైబడినవారికి ప్రతి ఒక్కరికి ఈ వ్యాక్సిన్ నీ అందజేయడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది.. ఈ నేపథ్యంలో కొంతమంది మనసులో ఎన్నో ప్రశ్నలు తలెత్తుతున్నాయి.. అందులో కొన్ని ప్రశ్నలకు ఇప్పుడు సమాధానం తెలుసుకుందాం..

18 సంవత్సరాల పైబడిన పెళ్లికాని అమ్మాయిలు ఈ వ్యాక్సిన్ ను తీసుకోవచ్చా అనే ప్రశ్న ప్రతి ఒక్క అమ్మాయి లో ఉత్పన్నమవగా డాక్టర్లు తమ విడత రాగానే వెంటనే వ్యాక్సిన్ ని తీసుకోవాలని సూచిస్తున్నారు.. పెళ్లై పిల్లలు ఉన్న స్త్రీలు కూడా ఈ వ్యాక్సిన్ కి అర్హులు అంటున్నారు.. ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునేవారు ఈ వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత గాని, ముందు గాని మూడు నెలల గ్యాప్ మెయింటైన్ చేయాలి అని చెప్తున్నారు.. అలాగే కృత్రిమ గర్భధారణ కోసం ప్రయత్నిస్తున్న వారు ఈ వ్యాక్సిన్ తీసుకోవద్దు.. మీ డాక్టర్ను సంప్రదించి దీని మీద ఒక నిర్ణయం తీసుకోమని సూచిస్తున్నారు నిపుణులు.. అలాగే పీరియడ్స్ ఉన్న టైంలో ఈ వ్యాక్సిన్ ను తీసుకువచ్చా అంటే నిరభ్యంతరంగా తీసుకోవచ్చు అని చెబుతున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: