గర్భధారణ సమయంలో మహిళలు మానసికంగా ఎంతో సతమతమవుతుంటారు. అందుకే ఇంట్లో పెద్దలు మనస్సు ప్రశాంతంగా ఉంచుకోవాలని చెబుతుంటారు. కానీ, శరీరంలో జరిగే మార్పుల వల్ల.. గర్భిణులకు మానసిక ప్రశాంతత లోపిస్తుంటుంది. హార్మోన్లల్లో తేడా వల్ల గర్భిణులకు మానసిక రుగ్మతలు, తలనొప్పి, చిరాకు వంటి సమస్యలు తలెత్తుతుంటాయి. కొందరికీ ఈ సమస్యలు భయానికి, ఆందోళనకు దారి తీస్తాయి. అయితే ఊరికే భయపడటం కూడా ఆరోగ్యానికి మంచిది కాదని వైద్యులు చెబుతున్నారు. గర్భిణులు భయపడటానికి కొన్ని కారణాలు ఉన్నాయని, అవేంటో తెలుసుకుందాం రండి.

గర్భిణులు సాధారణంగా తినే ఆహార పదార్థాలు కడుపులోని బిడ్డపై ప్రభావం చూపుతాయి. దీంతో ఎలాంటి ఆహారాన్ని తీసుకోవాలనే విషయంపై గర్భిణులు ఎక్కువగా భయపడుతుంటారని నిపుణులు చెబుతున్నారు. మనం తీసుకునే ఆహారం నేరుగా పుట్టబోయే బిడ్డకు అందుతాయి. కాబట్టి గర్భిణులు పౌష్టికాహారాన్ని మాత్రమే తీసుకోవాలని చెబుతున్నారు. టీ, కాఫీ, ఆల్కహాల్, మాంసం, పాలు, జున్ను వంటి ఆహార పదార్థాలను అవాయిడ్ చేయడం మంచిదంటున్నారు. వీటిని తీసుకోవడం వల్ల పుట్టబోయే బిడ్డపై భారీగా ప్రభావం చూపుతుందన్నారు.

కొందరికీ నెలలు నిండకుండానే పిల్లలు పుట్టేస్తారు. అయితే కడుపులో ఒకటి లేదా ఎక్కువ పిండాలు అభివృద్ధి చెందినప్పుడు ఇలాంటివి సంభవిస్తుంటాయి. అలాగే కొందరికి డెలివరీ డేట్ కంప్లీట్ అయ్యాక కూడా బిడ్డ కడుపులోనే ఉంటుంది. అలాంటి సమయంలో నెగ్లెట్ చెయొద్దని, వెంటనే వైద్యులను సంప్రదించాలని నిపుణులు చెబుతున్నారు.  అలాగే గర్భిణులకు నిద్ర చాలా అవసరం. కానీ, నిద్రపోతే పుట్టబోయే బిడ్డకు హానీ జరుగుతుందనే భయంతో నిద్రపోరు. అయితే నిద్రపోవడం వల్ల శిశువుకు ఎలాంటి హానీ జరగదు. ఎలాంటి ఆలోచనలు రానివ్వకుండా హాయిగా నిద్రపోవాలి.

డెలివరీ టైం దగ్గర పడుతుందంటే.. గర్భిణుల్లో టెన్షన్ మరింత పెరుగుతుంది. అబార్షన్ అవుతుందా..? నార్మల్ డెలివరీ అవుతుందా అని భయపడుతుంటారు. కానీ మీరు ఎంత రిలాక్స్ గా ఉంటే అంత మంచిది. డెలివరీ టైం దగ్గర పడిందని ఒత్తిడికి లోనవ్వద్దు. మీకు ఒక వేళ బాగా భయం వేసిందంటే.. మీకు నచ్చిన వాళ్లతో మాట్లాడండి. అప్పుడు మీరు ఆ ఆలోచనల నుంచి బయటికి వస్తారు. వీలైనంత వరకు గర్భిణులు ప్రశాంతంగా ఉండాలి. హెల్తీ ఫుడ్ తీసుకోవాలి. రోజు కనీసం గంటపాటు వ్యాయామం చేయాలి. అప్పుడే ఆరోగ్యంతోపాటు మానసిక ప్రశాంతతతో ఉంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి: