45 నుంచి 55 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న ఆడవాళ్ళలో రుతువిరతి ప్రారంభమవుతుంది. మెనోపాజ్ లక్షణాలు చాలా ఉన్నాయి. రాత్రిపూట విపరీతంగా చెమటలు పట్టడం, ఏకాగ్రత లేకపోవడం, యోని పొడిబారడం, ఆందోళన, మానసిక కల్లోలం వంటివి లక్షణాలు. మెనోపాజ్ తర్వాత కాల్షియం కోల్పోవడం వల్ల బోలు ఎముకల వ్యాధి, హృదయ సంబంధ సమస్యలకు దారితీస్తుంది. అందువల్ల, ఈ కాలంలో మంచి నిద్ర అలవాట్లను నిర్వహించడం, కావాల్సినంత విశ్రాంతి తీసుకోవడం చాలా అవసరం. మహిళలు బలమైన, ఆరోగ్యకరమైన ఎముకల కోసం కాల్షియం, విటమిన్ డి, మెగ్నీషియం అధికంగా ఉండే ఆహారాన్ని ఎక్కువగా తినాలి. అలాగే, శ్వాస వ్యాయామాలు, ధ్యానం వంటివి అలవాటు చేసుకుంటే.. శరీరం, మనస్సు ఆరోగ్యంగా ఉంటాయి.థైరాయిడ్ హార్మోన్లు మెడ ముందు భాగంలో ఉన్న థైరాయిడ్ గ్రంధి ద్వారా ఉత్పత్తి అవుతాయి. ఈ హార్మోన్ మన శరీర ఉష్ణోగ్రత, హృదయ స్పందన రేటు, మరెన్నో సహా అనేక శారీరక విధులను కూడా నియంత్రిస్తుంది.


థైరాయిడ్ బ్యాలెన్స్ లేనప్పుడు, అది జీవక్రియ, శక్తి స్థాయిలు, శరీర ఉష్ణోగ్రత, సంతానోత్పత్తి, బరువు పెరగటం, తగ్గటం, రుతుక్రమం, జుట్టు ఆరోగ్యం, మానసిక ఆరోగ్యం, గుండె స్పందన రేటు వంటి మీ శరీరం ప్రతి పనితీరును ప్రభావితం చేస్తుంది. ఎత్తుకు తగ్గ బరువు అనేది మనం జీవితంలో గుర్తుంచుకోవలసిన, పాటించవలసిన మంత్రం. ఊబకాయం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి.కాబట్టి బరువు పెరగకుండా చూసుకోవాలి. మధ్యవయస్సులో మహిళలు ఎదుర్కొనే సాధారణ సమస్యల్లో రక్తపోటులో హెచ్చుతగ్గులు ఒకటి. అధిక రక్తపోటు, మధుమేహం వంశపారంపర్య వ్యాధుల వంటి జీవనశైలి వ్యాధులు. జీవన పరిస్థితులు పెరిగే కొద్దీ వ్యాయామం తగ్గిపోయి, ఆహారపు అలవాట్లు మారుతున్నాయి. ఇది కొంత వరకు ఈ వ్యాధికి కారణం అవుతుంది.50 ఏళ్లు పైబడిన మహిళల్లో హార్మోన్ల మార్పులు కూడా పొత్తికడుపులో కొవ్వు పెరగడానికి కారణం. అధిక కొవ్వు ఇన్సులిన్ హార్మోన్ చర్యను నిరోధిస్తుంది. ఇది మధుమేహానికి దారితీస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: