ఉప్పెన సినిమాతో బిగ్ హిట్ అందుకున్న కృతిశెట్టి ప్ర‌స్తుతం ఫుల్ బిజీగా ఉంది. ఈ క‌న్న‌డ భామ చేసింది ఒక సినిమా అయినా ప్ర‌స్తుతం చేతి నిండా సినిమాల‌తో ఉంది. ప్ర‌స్తుతం కృతి శెట్టి చాలా క్రేజ్ ను సంపాధించుకుంది. కేవ‌లం టాలివుడ్ ఒక్క‌టే కాకుండా బాలివుడ్ కోలివుడ్ ఇలా అన్ని భాష ల సినిమాల‌ల్లో న‌టించ‌డానికి ఓకే చెప్పింది. ఇప్ప‌టి కే చాలా సినిమాలు షూటింగ్ ల‌లో ఉన్నాయి. అంతే కాకుండ ఇప్ప‌టికే ప‌లు సినిమాలు షూటింగ్ లరు సైతం పూర్తి చేసుకున్నాయి. చాలా త‌క్కువ సమ‌యంలో.. చాలా త‌క్కువ సిన‌మాలతో ఇంత క్రేజ్ తెచ్చుకున్న న‌టి అంటే కేవ‌లం ఈ బేబ‌మ్మ నే కావ‌చ్చు. 


ప్ర‌స్తుతం సినీ ప‌రిశ్ర‌మ‌లో ఎక్కువ రెమ్యూన‌రేష‌న్ తీసుకుంటున్న వారిలో ముఖ్యంగా ర‌ష్మిక మంద‌న్న‌, పూజా హెగ్డే, కీర్తీ సురేష్ ఉన్నారు. ప్ర‌స్తుతం ఈ మూగ్గురు స్టార్ హిరోయిన్ ల చేతిలోనే దాదాపు టాలివుడ్‌, బాలివుడ్‌, కోలీవుడ్ సినిమాలు అన్నీ ఉన్నాయి. నిర్మాత‌లు కూడా వీరి కే ప్రియారీటి ఇస్తున్నారు. ఈ స్టార్ హిరోయిన్ లు ఎంత రెమ్యూన‌రేష‌న్ డిమాండ్ చేసినా నిర్మాతలు వెన‌క‌డ‌టం లేదు. అంత‌లా డిమాండ్ ఉంది ఈ హిరోయిన్ ల‌కు. అయితే వీరికి ఏ మాత్రం తీసిపోకుండా కృతి శెట్టి సినిమాలు చేస్తుంది.



ప్ర‌స్తుతం బేబ‌మ్మ చేతి నిండా సినిమాలు ఉన్నాయి. బాలివుడ్ సినిమాల‌కు కూడా గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింద‌టంటు ఫీల్మి న‌గ‌ర్ గుస గుస లు వినిపిస్తున్నాయి. కాగ కృతి శెట్టి ప్ర‌స్తుతం నేచుర‌ల్ స్టార్ నాని న‌టిస్తున్న శ్యామ్ సింగ రాయ్ సినిమాలో న‌టిస్తోంది. ఈ సినిమాలో మ‌రో ఇద్ద‌రు హిరోయిన్ లు ఉన్నా.. అంద‌రి చూపు బేబ‌మ్మ పై నే ఉన్నాయి. ఈ సినిమా ఈ సంవ‌త్స‌రంలోనే విడుద‌ల కానుంది. అలాగే ఎన‌ర్జిటిక్ హిరో రామ్ పోతినేని త‌మిళ డైరెక్ట‌ర్ ఎన్‌. లింగుస్వామీ కాంబినేష‌న్ లో వ‌స్తున్న సినిమాలోనూ కృతి శెట్టి హిరోయిన్ గా న‌టిస్తోంది. దీంతో పాటు నాగ‌ర్జునా నాగ చైత‌న్య హిరోలుగా వ‌స్తున్న సోగ్గాడే చిన్ని నాయ‌నా సీక్వెల్ సినిమా అయిన బంగార్రాజు అనే సినిమాలో నాగ చైత‌న్య కు జోడీగా న‌టిస్తోంది. ఈ సినిమా షూటింగ్ ఇప్ప‌టికే షూటింగ్ ప్రారంబ‌మైంది. అలాగే సుధీర్ బాబు హిరోగా వ‌స్తున్న సినిమాఅమ్మాయి గురించి మీకు చెప్పాల‌ని ఉంది. ఈ సినిమాలో కూడా హిరోయిన్ గా మ‌న బేబ‌మ్మ నే న‌టిస్తుంది. అలాగే తాజాగా యంగ్ హిరో నితిన్ స‌ర‌స‌న హిరోయిన్ గా న‌టించ‌డానికి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. ఈ సినిమా కు మాచ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గం అనే టైటిల్ ను కూడా ఖ‌రారు చేసారు. ఇలా ప్ర‌స్తుతం 5 క్రేజీ ప్రాజెక్టు ల‌తో బేబ‌మ్మ ఫుల్ బిజీగా ఉంది.




మరింత సమాచారం తెలుసుకోండి: