ఈ మ‌ధ్య కాలంలో నెటిజ‌న్ల‌కు సెల‌బ్రెటీ ల మ‌ధ్య త‌రుచూ వివాదాలు జ‌రుగుతున్నాయి. సోష‌ల్ మీడియా వేదిక‌గా సెల‌బ్రెటీలు త‌మ హాట్ ఫోటోల‌ను ఫోస్ట్ చేయ‌డం వాటి ని ఉద్ధేశించి నెటిజ‌న్లు కామెంట్ చేయ‌డం.. ఆ కామెంట్ల పై సెల‌బ్రెటీలు ఫైర్ అవ‌డం ఈ మ‌ధ్య కాలంలో ఎక్కువ గా జ‌రుగుతుంది. సెల‌బ్రెటీ ల‌ను నెటిజ‌న్లు కామెంట చేసిన‌ప్పుడు కొంత మంది సెల‌బ్రెటీలు సున్నితంగా తీసుకుని వారికి వెట‌కారంగా స‌మాధానం ఇస్తుంటారు. మ‌రి కొంత మంది సెలబ్రెటీ లు సీరియ‌స్ తీసుకుని వారికి వార్నింగ్ ఇస్తుంటారు. అయితే ఇలాంటి ప‌రిస్థితి బాలీవుడ్ బ్యూటీ ఈషా గుప్తా కు ఎదురు అయింది. కానీ విష‌యాన్ని ఈషా గుప్తా జోక్ తీసుకోలేదు. చాలా సీరియ‌స్ గా తీసుకుంది.అంతే కాకుండా నెటిజ‌న్ల పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు కూడా చేసింది. అస‌లు ఏం అయిందంటే ఈ మ‌ధ్య కాలంలో బాలీవుడ్ హీరోయిన్ ఈషా గుప్తా సోష‌ల్ మీడియా లో త‌న హాట్ ఫోటో ల‌ను ఫోస్ట్ చేసింది. ఆ ఫోటో లు టాప్ లేస్ గా ఉన్నాయి. ఆ ఫోటో ల‌కు స‌న్ బాత్ అంటు కాప్ష‌న్ కూడా పెట్టింది. ఈ హాట్ ఫోటో ల పై కొంత మంది నెటిజ‌న్లు పాజిటీవ్ గా కామెంట్లు పెట్టారు. కానీ కొంత మంది నెటిజ‌న్లు కాస్త నెగిటీవ్ గా కామెంట్లు పెట్టారు. అంతే కాకుండా ఆమె ను అస‌భ్య‌కరంగా ట్రోల్స్ చేస్తూ కామెంట్లు పెట్టారు. దీంతో ఈషా గుప్తా నెటిజ‌న్ల పై ఫైర్ అయింది.హీరో లు అర్ధ‌న‌గ్నంగా ఫోటో లు పెడితే ఇలా ఎందుకు కామెంట్స్ పెట్టరు అని ప్ర‌శ్నించింది. అంతే కాకుండా కొంత‌మంది నెటిజ‌న్లు ఈ రోజుల్లో కూడా లింగ వివ‌క్ష చూపుతున్నార‌ని ఫైర్ అయింది. గ‌తంలో నాపై ట్రోల్స్ చేస్తే విప‌రీతంగా బాద పడేదాన్ని.. కానీ ప్ర‌స్తుతం వాటిని ప‌ట్టించు కొవ‌డం మానేశాను అని అంది. మ‌హిళ ల విష‌యంలో స‌మాజంలో చాలా మార్పు రావాల‌ని అంది. అలాగే ఇక నుంచి త‌నను ఎవ‌రైనా ఒక చెంప మీద కొడితే తాను ఉరుకొను అని అంది. వారి రెండు చెంప ల‌ను త‌ప్ప‌ని స‌రిగా వాయిస్తాను అని ఘ‌టు గా స్పందించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: