ర‌జినికాంత్ హీరోగా న‌య‌న తార హీరోయిన్ గా ప్ర‌భు , జ్యోతిక ముఖ్య పాత్ర‌లో వ‌చ్చిన సినిమా చంద్ర‌ముఖి. ఈ సినిమా ను త‌మిళ్ నుంచి రీమెక్ చేశారు. త‌మిళ్ లో కూడా ర‌జినికాంత్ తో పాటు వీరే నటించారు. అయితే ఈ సినిమా ను ముందుగా క‌న్న‌డ బాష‌లో తీశారు. క‌న్న‌డా సినిమా ను డబ్బింగ్ చేస్తు త‌మిళ్, తెలుగు భాషాల‌లో తెర‌కెక్కించారు. అయితే ఈ సినిమా లో దుర్గ పాత్ర‌లో న‌య‌న‌తార ను ఫిక్స్ చేశారు. కాని గంగ పాత్ర‌లో చాలా మంది హీరోయిన్ ల‌ను సంప్ర‌దించారు. అయితే ఈ పాత్ర కోసం ముందుగా స్నేహా ను అనుకున్నారు. కానీ అది వీలు కాలేదు. దీంతో సిమ్రాన్ ను ఆ పాత్ర కోసం ఎంచుకున్నారు.సిమ్రాన్ కూడా చంద్ర‌ముఖి సినిమా లో గంగ పాత్ర చేయ‌డానికి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. అంతే కాకుండా సిమ్రాన్ కొన్ని రోజుల పాటు షూటింగ్ లో కూడా పాల్గొంది. అయితే చంద్రముఖి సినిమా షూటింగ్ స‌మ‌యంలో సిమ్రాన్ గ‌ర్భ‌వ‌తి అని తెలిసింది. దీంతో హీరోయిన్ సిమ్రాన్ నే చంద్ర‌ముఖి సినిమా నుంచి త‌ప్పుకుంది. అనంతరం ఈ క్యారెక్ట‌ర్ కోసం స‌దా, రీమా సేన్ అనే హీరోయిన్ ల‌ను సంప్ర‌దించార‌ట‌. అయితే వారు తిర‌స్క‌రించ‌డం తో జ్యోతిక ను గంగా పాత్ర కోసం సెల‌క్ట్ చేశారు. అలా చంద్ర‌ముఖి వంటి హిట్ చిత్రం నుంచి హీరోయిన్ సిమ్రాన్ త‌ప్పు కుంది. ఒక వేల సిమ్రాన్ చంద్ర ముఖి సినిమా చేసి ఉంటే సిమ్రాన్ సినిమా భ‌విష్య‌త్తు మ‌రోలా ఉండేది అని త‌న అభిమానులు అంటున్నారు. అయితే చంద్రముఖి సినిమా సూప‌ర్ స్టార్ ర‌జినికాంత్ సినిమా చ‌రిత్ర లో నే బిగ్ హిట్ అందుకుంది. అలాగే తెలుగు లో నూ ర‌జినికాంత్ కు స్టార్ డ‌మ్ తీసుకువ‌చ్చిన సినిమా కూడా చంద్ర‌ముఖి సినిమా నే.
మరింత సమాచారం తెలుసుకోండి: