ఒక కారు బెంగుళూరు వీధుల్లో తిరుగుతూ సందడి చేస్తోంది..ఈ కారుకు ఉన్న ప్రత్యేక తలు అందరి చూపును లాగేసుకున్నాయి. ఒక సాధారణమైన వ్యక్తి ఈ కారును తయారు చేశారు.. ప్రస్తుతం ఈ కారు అందుకు సంబందించిన ఫీచర్లు అందరిని ఆశ్చర్యపరిచింది.. అవేంటో ఇప్పుడు చూద్దాం.. కాలుష్యాన్ని నివారించే విధంగా ఈ కారును రూపొందించారు. ఇలాంటి వాహనాలను మార్కెట్ లోకి తీసుకురావాలని ఆలోచిస్తుంది. మిషన్‌ బెంగళూరు- 2022 అమలులో భాగంగా కర్ణాటకప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. రహదారుల విస్తరణ, ట్రాఫిక్‌ నియంత్రణతో పాటు పర్యావరణ పరిరక్షణ కీలకంగా భావించి ప్రణాళికలు అమలు చేస్తోంది. కాలుష్య రహిత వాహనాలతో బెంగళూరుతో పాటు రాష్ట్రంలోని ఇతర జనావాసాలు సందడిగా మారనున్నాయి..



మరో రెండేళ్లలో ఇలాంటి వాహనాలను పూర్తిగా అందుబాటులోకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. రూ.23 వేల కోట్ల విలువైన ఈ ప్రాజెక్టులు రానున్న రెండేళ్లలో విద్యుత్తు వాహనాల సంఖ్యను భారీగా పెంచనుంది.కర్ణాటక ప్రభుత్వం రాష్ట్రాన్ని ఈవీ హబ్ గా మార్చేందుకు సన్నాహాలు చేస్తుంది.ఎలెస్ట్‌ ప్రైవేటు లిమిటెడ్‌ ప్రాజెక్టు విలువ రూ.20,400 కోట్లు కాగా, హ్యూనెట్‌ సంస్థ మరో రూ.2,600కోట్ల విలువైన ప్రాజెక్టులకు అనుమతి పొందింది. ఈ రెండు ప్రాజెక్టుల ద్వారా కర్ణాటకలో కనీసం 10 వేల మందికి ఉపాధి లభిస్తుంది.ఇలాంటి ప్రాజెక్టుల వల్ల కేవలం కన్నడీలకు మాత్రమే కాదు తమిళలకు, ఆంధ్రులకు కూడా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని భారీ పరిశ్రమల మంత్రి జగదీశ్‌ శెట్టర్‌ ప్రకటించారు. సంప్రదాయేతర, సుస్థిర ఇంధన తయారీలో భాగంగా ఎస్‌హెచ్‌ఎల్‌సీసీ మరో రెండు హైబ్రిడ్‌ సోలార్‌ విద్యుత్తు యూనిట్‌లకు అనుమతి ఇచ్చింది. రూ.4,240 కోట్ల విలువైన ఈ ప్రాజెక్టు ద్వారా ఎనిమిది వేల మందికి ఉపాధి కల్పించే దిశగా ఆలోచనలు చేస్తుంది ..



ఈ ప్రాజెక్ట్ ను సౌర, విద్యుత్ తో నడవనుంది..విదేశీ పెట్టుబడులను విశేషంగా ఆకర్షిస్తున్న కర్ణాటక ప్రభుత్వం పారిశ్రామిక విధానాల సవరణ చట్టాల్లో భాగంగా అఫిడవిట్‌ బేస్డ్‌ క్లియరెన్స్‌ సిస్టం ను అమలు చేసింది. ఇందులో భాగంగా పెట్టుబడులు పెట్టే సంస్థలు తొలి మూడేళ్లలో వ్యవస్థాగత అనుమతులు లేనిదే వ్యాపార కార్యకలాపాలు ప్రారంభించే వీలుంది.కరోనా వల్ల ఆర్దికంగా కుదేలు అయిన కర్ణాటక ప్రభుత్వానికి ఈ ప్రాజెక్ట్ మళ్లీ ఆశలను చిగురిస్తుంది అంటూ ఆ రాష్ట్ర   సీఎం యడియారప్ప పేర్కొన్నారు.. 

మరింత సమాచారం తెలుసుకోండి: