ఇక ఓలా ఎలక్ట్రిక్ తమ ఎలక్ట్రిక్ స్కూటర్ అమ్మకాలను పెంచుకునేందుకు సరికొత్త మార్కెట్ క్యాంపైన్‌తో ముందుకు వచ్చింది. ఈ మధ్య , ఓలా వ్యవస్థాపకుడు భవిష్ అగర్వాల్ ఓలా ఎస్1 ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్‌ను పూర్తి చార్జ్ పై 200 కిలోమీటర్లు నడిపిన ఓ కస్టమర్‌కు ఫ్రీ గా ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్‌ను బహుమతిగా ఇచ్చిన సంగతి తెలిసినదే.ఇక కార్తీక్ అనే వ్యక్తి, తన ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ ను మూవ్ ఓఎస్ 2.0 కి అప్‌గ్రేడ్ చేసుకున్న తర్వాత కొత్త ఎకో మోడ్ లో పూర్తి చార్జ్ పై అతను 202 కిలోమీటర్లు రైడ్ చేశాడు.ఇక ఈ నేపథ్యంలో, కార్తీక్ సాధించిన రేంజ్ పట్ల ఆశ్చర్యపోయిన భవీష్ అగర్వాల్, ఆ వ్యక్తిని ప్రత్యేకంగా కలిసి హోలీ నాడు విడుదల చేసిన తమ స్పెషల్ ఎడిషన్ గెరువా కలర్ ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ ను గిఫ్ట్ గా ఇచ్చాడు. అంతేకాకుండా, ఇప్పుడు పూర్తి ఛార్జింగ్‌తో 200 కిలోమీటర్ల రేంజ్ ను కవర్ చేసిన మరో మొదటి 10 మంది కస్టమర్‌లకు కూడా ఫ్రీ గా 'గెరువా' కలర్ ఓలా స్కూటర్‌లను బహుమతిగా ఇవ్వనున్నట్లు భవిష్ అగర్వాల్ తన సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.ఇక ఓలా ఎలక్ట్రిక్ ఇటీవలే తమ ఎస్1 ఇంకా ఎస్1 ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్ యజమానుల కోసం మూవ్ ఓస్ 2.0 (MoveOS 2.0) ని ఓటిఏ (ఓవర్ ది ఎయిర్) అప్‌డేట్ ద్వారా రిలీజ్ చేసింది. అయితే, ఇది ప్రస్తుతం బీటా దశలో ఉంది. అలాగే ఎంపిక చేసిన నగరాలలో ఎంపిక చేయబడిన యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంది. ఈ కొత్త అప్‌డేట్స్ లో భాగంగా ఓలా ఎస్1 (Ola S1) ఇంకా ఎస్1 ప్రో (Ola S1 Pro) ఎలక్ట్రిక్ స్కూటర్ల కోసం కొత్త ఎకో మోడ్‌ (Eco Mode) పాటుగా మరిన్ని స్పెషల్ అప్‌గ్రేడ్స్ ను కంపెనీ పరిచయం చేయనుంది. ఇవన్నీ కూడా రైడర్లకు మరింత అత్యుత్తమైన సౌలభ్యాన్ని ఇంకా అలాగే ఎక్కువ రేంజ్ ను అందించేలా చేస్తాయని కంపెనీ చెబుతోంది.ఖచ్చితంగా ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ జనాలను బాగా ఆకట్టుకుంటుందనడంలో ఎలాంటి సందేహం అనేది లేదు. ఇక ఈ మోడల్స్ కూడా చాలా స్మార్ట్ గా ఇంకా అలాగే స్టైలిష్ గా వున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: