నేడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా ఆయన నటిస్తున్న సినిమా నుంచి అదిరిపోయే అప్డేట్స్ వచ్చాయి, వాటికి మిశ్రమ స్పందన కూడా వస్తోంది అనుకోండి అది వేరే విషయం. అయితే భీమ్లా నాయక్ సినిమా నుంచి టైటిల్ సాంగ్‌ విడుదల చేయగా క్రిష్ దర్శకత్వంలో పవన్ నటిస్తున్న హరి హర వీరమల్లు సినిమా నుంచి కూడా రిలీజ్ డేట్ తో కూడిన అప్డేట్ వచ్చింది. మరో పక్క సురేందర్ రెడ్డి డైరెక్షన్‌లో రామ్ తాళ్లూరి నిర్మాణంలో ఓ సినిమా చేస్తున్న క్రమంలో ఈ సినిమా నుంచి కూడా అప్డేట్ వచ్చింది. ఇవే కాకుండా పవన్‌తో గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ ఓ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా దాని నుంచి కూడా ఒక పోస్టర్ రిలీజ్ చేశారు, అయితే అనూహ్యంగా ఈ నాలుగు సినిమాల పోస్టర్స్ లో పవన్ కళ్యాణ్ పేరుకు పవర్ స్టార్ అనే పేరు లేకపోవడం ఆశ్చర్యకరంగా మారింది. పవన్ జనసేనాని ట్యాగ్ నే ఇష్టపడుతున్నాడని అందుకే ఆ పేరు ఎక్కడా వాడలేదని అంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: