ఎన్నోరకాల ఔషధ గుణఆలున్న వేపాకులతో చర్మ సౌందర్యాన్ని కూడా మెరుగుపరుచుకోవచ్చు. యాంటీ సెప్టిక్ లక్షణాలు మెండుగా ఉండే వాకు మంచి ఆస్ట్రిజెంట్ గా కూడా పనిచేస్తుంది. జిడ్డు స్వభావంతో ఉండే చర్మం కలిగినవారికి వేపాకు అద్భుతంగా పనిచేస్తుంది. ఓ కప్పు నీటిని స్టీలు గిన్నెలో పోసి, మరో కప్పు వేపాకులను ఆ నీటిలో వేసి 20 నిమిషాలపాటు బాగా మరిగించాలి. చల్లారిన తరువాత వడగట్టి ప్రీజ్ లో భద్రపరుచుకోవాలి.
ముందుగా ముఖాన్ని శుభ్రం చేసుకున్న తరువాత ప్రిజ్ లో భద్రపరచుకోవాలి. ముందుగా ముఖాన్ని శుభ్రం చేసుకున్న తరువాత ప్రిజ్ లో భద్రపరచిన వేపాకు మిశ్రమాన్ని తీసుకుని ముఖానికి అద్దుకోవాలి. ఇలా క్రమంతప్పకుండా చేస్తే ముఖంలో జిడ్డుతత్వంపోయి. ఎల్లపుడూ ప్రెష్ గా కనిపిస్తుంది. వెంట్రుకల సమస్యల నివారణా చికిత్సలో కూడా వేపాకులను విరివిగా వాడుతుంటారు.
వేపాకులను వేసి కాచిన నీటితో జుట్టును శుభ్రం చేస్తూ ఉంటే వెంట్రుకలు రాలడం తగ్గటమేకాకుండా జుట్టు బాగా పెరుగుతుంది. అంతేకాకుండా వెంట్రుకలు నిగనిగలాడుతూ ఉంటాయి. పేలు, చుండ్రులాంటి సమస్యలకు సైతం వేపాకు రసం చక్కగా పనిచేస్తుంది. వేపాకు రసాన్ని వారానికి ఒకసారి రాసుకుంటూంటే జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది. ముఖం అందంగా కనపడుతూంటుంది.
మరింత సమాచారం తెలుసుకోండి: