సాధారణంగా తలలో ఎక్కువ చుండ్రు ఉన్నప్పుడు దురద వస్తూ ఉంటుంది. అంతేకాకుండా పేలు,దుమ్ము, ధూళి కారణంగా కూడా దురద రావడం సహజం. ఈ దురద రావడం వల్ల చికాకు,ఇరిటేషన్ వంటివి వస్తాయి. అంతేకాకుండా ఒక్కొక్కసారి కోపానికి కూడా గురి అవ్వాల్సి వచ్చింది. అయితే ఈ దురద నుంచి తప్పించుకోవడానికి,ఎన్నో రకాల పద్ధతులను పాటించినప్పటికీ పెద్దగా ఫలితాలు ఉండవు. కానీ ఇప్పుడు చెప్పబోయే కొన్ని చిట్కాలు పాటిస్తే, తలలో దురద ను తగ్గించుకోవచ్చు అంటున్నారు నిపుణులు..


మందార పువ్వు,మందార ఆకులను మెత్తగా నూరి, పేస్ట్ లా తయారు చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని కుదుళ్ళకు పట్టించి, 40 నిమిషాల పాటు ఆరనివ్వాలి. ఆ తర్వాత గోరువెచ్చని నీటితో తలస్నానం చేస్తే మంచి ఉపశమనం కలుగుతుంది. అంతేకాకుండా ఈ పద్దతిని వారానికి రెండు సార్లు ఉపయోగించడం వల్ల దురద తగ్గడంతోపాటు జుట్టు రాలే సమస్యను అధిగమించవచ్చు.


బాదం పప్పులను పొడిగా చేసుకొని, అందులో కొద్దిగా ఆలివ్ ఆయిల్ వేసి కుదుళ్ళకు బాగా పట్టించాలి. 30 నిమిషాల పాటు ఆరనిచ్చి, చల్లని నీటితో స్నానం చేయడం వల్ల తలకు తగినంత తేమను అందించడమే కాకుండా దురద కూడా తగ్గుతుంది.


బీట్రూట్ రసంలో గోరింటాకు పొడి,పెరుగు కలిపి తల  కుదుళ్ళ కు పట్టించి, 20 నిమిషాల పాటు ఆరనివ్వాలి. ఆ తర్వాత  తలస్నానం చేయాలి. ఈ పద్ధతిని వారానికి ఒక్కసారి ఉపయోగించడం వల్ల త్వరగా ఉపశమనం కలుగుతుంది.


అంతేకాకుండా దుమ్ము, ధూళి పడినప్పుడు తక్కువ గాఢత కలిగిన షాంపూతో తలస్నానం చేయడం మంచిది.అంతేకాకుండా గోరువెచ్చని నీటితో మాత్రమే తలస్నానం చేయడానికి అలవాటు పడాలి.అంతేకాకుండా అలోవెరా గుజ్జును కూడా తీసుకొని జుట్టు కుదుళ్ళకు పట్టిస్తూ ఉండడం వల్ల కళ్లలో దురద నుంచి తప్పించుకోవచ్చు.. కాబట్టి పైన చెప్పిన పద్ధతులను వారానికి ఒకసారి పాటించి, తలలో ఉండే దురద,దుమ్ము, ధూళిని పోగొట్టు కోవడమే కాక జుట్టు రాలే సమస్య నుంచి కూడా బయటపడవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: