ఇప్పుడు కరోనా వైరస్ ని ఎదుర్కోవడానికి గానూ మహారాష్ట్ర నరకం చూస్తుంది. లాక్ డౌన్ ఇన్ని రోజులు కఠినం గా అమలు చేసినా సరే కేసులు మాత్రం ఆగడం లేదు. ఎన్ని విధాలుగా కట్టడి చెయ్యాలని ప్రయత్నాలు చేసినా సరే కేసులు మాత్రం ఆగే అవకాశాలు ఏ విధంగా చూసినా సరే కనపడటం లేదు. 

 

దీనితో మహారాష్ట్రకు కేరళ నుంచి వైద్యులను నర్సులను పంపించారు. ముంబై నగరానికి కేరళ రాష్ట్రానికి చెందిన వందమంది వైద్యులు, నర్సుల బృందాన్ని పంపించినట్లు కేరళ రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి థామస్ ఇసాక్ ఒక ప్రకటనలో చెప్పారు. తిరువనంతపురం టీవీవీ మెడికల్ కళాశాల డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ సంతోష్ కుమార్ నేతృత్వంలో వైద్యబృందాన్ని ముంబై నగరంలోని సెవెన్ హిల్స్ ఆసుపత్రికి పంపించామని ఆయన అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: