తెలంగాణ రాష్ట్రంలో ఒకవైపు కరోనా మహమ్మారి విజృంభణ వల్ల ప్రజలు భయాందోళనకు గురవుతుండగా మరోవైపు రాష్ట్రానికి మిడతల దండు రూపంలో ప్రమాదం పొంచి ఉంది. ఆఫ్రికా నుంచి భారత్ కు చేరిన మిడతల దండు ప్రస్తుతం మహారాష్ట్రలోని నాగ్ పూర్ దగ్గర ఆగింది. ఈ దండు నాగ్ పూర్, గోండియా జిల్లాల్లోని బత్తాయి తోటలపై దాడులు చేస్తోంది. సీఎం కేసీఆర్ ఇప్పటికే మిడతల దండు వస్తే ఎలా ఎదుర్కోవాలన్న విషయం గురించి ఐదుగురు సభ్యుల బృందాన్ని ఏర్పాటు చేశారు. 
 
తెలంగాణకు కేవలం 200 కిలోమీటర్ల దూరంలో మిడతల దండు ఉండటంతో ఈరోజు ఈరోజు సీఎస్ సోమేష్ కుమార్ ఐదుగురు సభ్యుల బృందంతో పాటు ఉమ్మడి ఆదిలాబాద్, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, నిజామాబాద్, కామారెడ్డి, సంగారెడ్డి జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో సమావేశం కానున్నారు. అయితే అధికారులు దక్షిణం నుంచి ఉత్తరానికి గాలి వీస్తోందని.... ఈ దండు ఇప్పట్లో రాష్ట్రానికి వచ్చే అవకాశం లేదని  చెబుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: