తమిళనాడు లో ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్ది రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఇప్పటికే ఆయా పార్టీల నేతలు ఘాటు వ్యాఖ్యలతో పోలిటికల్ హిట్ పెంచుతున్నారు. తాజాగా డి‌ఎం‌కే పార్టీ అద్యక్షుడు స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు సంచలనం సృస్తిస్తున్నాయి. మాజీ సి‌ఎం జయలలిత మరణం పై ఎన్నో అనుమానాలు ఉన్నాయని, తాము అధికరంలోకి వచ్చిన తరువాత ఆమె మరణంపై విచారణ జరిపిస్తామని హాట్ కామెంట్స్ చేశారు. జయలలితకు, తమకు సిద్దాంతల పరంగా అనేక విభేదాలు ఉన్నప్పటికి ఆమెను తమిళనాడు సి‌ఎం గా ఎంతో గౌరవిస్తామని ఆయన అన్నారు. మోడీ ని సైతం ధైర్యంగా ఎదుర్కొన్న మహిళా జయలలిత అని ఆయన వ్యాఖ్యానించారు. నీట్, సిఏఏ వ్యతిరేకంగా జయలలిత పని చేశారని స్టాలిన్ అన్నారు. మరి ఈ వ్యాఖ్యలపై అన్నా డి‌ఎం‌కే పార్టీ నేతలు ఎలాంటి సమాధానం చెబుతారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: