భారత దేశ చరిత్రలో జలియన్ వాలాబాగ్ ఘటన ఎప్పటికీ చెరిగిపోని ఒక రక్తపు మచ్చ..భారత స్వాతంత్ర సంగ్రామ చరిత్రలో అత్యంత దురదృష్టమైన, హేయమైన సంఘటనగా జలియన్ వాలాబాగ్ ఉదంతం నిలిచిపోయింది. నాటి బ్రిటిష్ పాలకుల దుశ్చర్యకు వందలాది మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. వీరిలో చిన్నారులు, మ‌హిళ‌లు కూడా ఉండ‌టం విచార‌క‌రం. ఈ మరణకాండ 1919 ఏప్రెల్ 13న ఈ ఉదంతం జరిగింది. 

నేటితో ఈ నరమేధం జరిగి 102 ఏళ్ళు పూర్తి అయిన సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోడి ట్విట్టర్ లో స్పందించారు. " జలియన్ వాలాబాగ్ దురంతంలో అమరులైన వారికి నా నివాళులు. వారి దైర్యం, త్యాగం, సాహసం, ప్రతి భారతీయ పౌరుడిలో శక్తిని పెంపొందిస్తాయి. " అంటూ ప్రధాని ట్వీట్ చేశారు. ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు కూడా స్పందిస్తూ " ఆ చెడు ఘటన ప్రతి భారతీయుడి గుండెలో మెదులుతూనే ఉంటుందని " అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: