కరోనా సెకండ్ వేవ్ భారతదేశాన్ని కమ్మేస్తోంది. రోజుకు లక్షల్లో కేసులు.. వేలల్లో మరణాలు నమోదు అవుతున్నాయి. పరిస్థితి తీవ్రంగా ఉంది. ప్రపంచ దేశాలు కూడా భారత్ పరిస్థితి చూసి భయపడుతున్నాయి. ఈ క్రమంలోనే భారత్ విషయంలో అగ్రరాజ్యం అమెరికా అప్రమత్తమైంది. భారత్‌కు ఎవ్వరూ వెళ్లవద్దని వార్నింగ్ ఇచ్చింది. అలాగే భారత్‌లో ఉన్న అమెరికా పౌరులు అందరూ తిరిగి రావాలని అమెరికా ప్రభుత్వం కోరింది.
వీలయినంత త్వరగా
భారత్ నుంచి తిరిగి వస్తేనే మంచిదని సూచించింది. భారత్‌లో కరోనా పరిస్థితి పూర్తిగా కంట్రోల్ తప్పేసిందని కూడా ఈ సందర్భంగా
అమెరికా స్పష్టం చేసింది.
అమెరికా చేసిన ప్రకటనతో ప్రపంచ దేశాలు కూడా భారత్‌తో సంబంధాలు కొద్ది రోజుల పాటు వాయిదా వేయనున్నారు. ఇది పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.