కరోనా మహమ్మారి చేతిలో చిక్కి ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలు విలవిలలాడుతున్నాయి. కొన్ని దేశాలు సరైన పద్దతిలో కరోనా ను అంతమొందించే ప్రణాళికలు వేసినప్పటికి కరోనా విజృంభణ ఆగడం లేదు. ఇక భరత్ లో పరిస్థితి మాత్రం చేయిజారిపోయింది. దేశం మొత్తం కరోనా మృత్యుకోరల్లో ఉంది. అయితే తాజాగా బ్రిటన్ లో మాత్రం అనూహ్యంగా కరోనా నెమ్మదించింది. అంతే కాదు ఈ ఏడాది ఆగష్టు వరకు దేశంలో ఎక్కడ కరోనా పాజిటివ్ వ్యక్తులు అనే వారే ఉండరు అంటూ UK వాక్సిన్ టాస్క్ ఫోర్స్ చీఫ్ చెప్తున్నారు. ఇది నిజంగా ఆ దేశానికి ఎంతో మంచి పరిణామం.
 

మరింత సమాచారం తెలుసుకోండి: