అమ‌రావ‌తి : రాష్ట్రంలో కొవిడ్ మృతుల అంత్యక్రియలకు సంబంధించి సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. 2021-22 ఏడాదికి గాను కొవిడ్ మృతుల అంత్యక్రియలకు రూ.15 వేలు చొప్పున ఆర్థికసాయం అందించాలని నిర్ణయించారు. దీనికి సంబంధించి ఏపీ ప్రభుత్వ ఆరోగ్య శాఖ ముఖ్యకార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ పేరిట ఉత్తర్వులు వెలువడ్డాయి.ఈ మేరకు జిల్లా కలెక్టర్లకు అధికారాలు మంజూరు చేస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కొవిడ్ నియంత్రణ, సహాయ చర్యలకు కేటాయించిన నిధుల నుంచి ఈ ఆర్థికసాయం అందజేయాలని కలెక్టర్లకు సూచించారు. ఏపీ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ ఈ నిధులను ఆయా జిల్లాల కలెక్టర్లకు విడుదల చేస్తారని వివరించారు.

రాష్ట్రంలో క‌రోనా వైర‌స్ ఉధృతి కొన‌సాగుతుంది.దీనిని నియంత్రించ‌డానికి ప్ర‌భుత్వం చ‌ర్య‌లు తీసుకుంటుంది.ఇప్ప‌టికే రాష్ట్ర వ్యాప్తంగా పాక్షిక లాక్‌డౌన్‌ని అమ‌లు చేస్తుండ‌గా..కేసులు మాత్రం త‌గ్గ‌డంలేదు.కేసుల‌ను త‌గ్గాలంటే సంపూర్ణ లాక్‌డౌన్ పెట్టాల‌ని అధికారులు ప్ర‌భుత్వానికి సూచించారు.అయితే రెండు మూడు  రోజుల్లో లాక్‌డౌన్ పై సీఎం జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డి కీల‌క నిర్ణ‌యం తీసుకునే అవ‌కాశం ఉంది.ఇటు క‌రోనా మ‌ర‌ణాలు సైతం రోజుకు వంద‌కు పైగానే న‌మోద‌వుతున్నాయి.ఎక్కువ‌గా ఆక్సిజ‌న్ అంద‌క క‌రోన రోగులు మ‌ర‌ణిస్తున్నారు.రాష్ట్రంలో ఆక్సిజ‌న్ కొర‌తను అధిగ‌మించేందుకు ప్ర‌భుత్వం అన్నిచ‌ర్య‌లు తీసుకుంటుంది. ఇప్ప‌టికే పలు రాష్ట్రాల నుంచి భారీగా ఆక్సిజ‌న్‌ను స‌ర‌ఫ‌రా చేసుకుంటుంది.మ‌రోవైపు రెమిడిసివ‌ర్ ఇంజెక్ష‌న్ల‌ను కూడా ప్ర‌భుత్వం అన్ని ఆసుప‌త్రుల్లో ఉండేలా చూస్తుంది.ఇంజెక్ష‌న్లను బ్లాక్ మార్కెట్‌లో అమ్మేవారిని విజిలెన్స్ అధికారులు ప‌ట్టుకుంటున్నారు.ఇప్ప‌టికే ప‌లు ఆసుప‌త్రుల‌పై విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వ‌హించారు.దాడుల్లో అధిక ఫీజులు వ‌సూళ్లు చేస్తుండ‌టం,రెమిడిసివిర్ ఇంజెక్ష‌న్లు బ్లాక్ లో అమ్ముతుండ‌టాన్ని విజిలెన్స్ అధికారులు గుర్తించారు.నిబంధ‌న‌లు ఉల్లంఘించిన ఆసుప‌త్రుల‌ను సీజ్ చేశారు

క‌రోనాతో మృతి చెందిన వారి అంత్య‌క్రియ‌లు మొద‌ట్లో ఆయా న‌గ‌ర పంచాయ‌తీలు, మున్సిప‌ల్ కార్పోరేష‌న్‌లు నిర్వ‌హించాయి.ఇప్పుడు కొంత‌మంది కుటుంబ స‌భ్యులు,అధికారులు చేస్తున్నారు.అంత్య‌క్రియల ఖ‌ర్చును అధికారులే భ‌రిస్తున్నారు.దీనిని దృష్టిలో పెట్టుకున్న ప్ర‌భుత్వం ద‌హ‌న సంస్కారాల‌కు 15వేల రూపాయ‌ల చొప్పున ఇవ్వాల‌ని నిర్ణయించింది.దీనికి సంబంధిచిన ఉత్త‌ర్వుల‌ను వైద్య ఆరోగ్య‌శాఖ ముఖ్య‌కార్య‌ద‌ర్శం అనిల్ కుమార్ సింఘాల్ విడుద‌ల చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: