నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు సంధర్భంగా ఆయనకు సినీ సెలబ్రిటీలు, రాజకీయ నేతలు విషెస్ చెబుతున్నారు. అయితే ఆయన అల్లుడు, మాజీ మంత్రి నారా లోకేష్ లేట్ విషెస్ చెప్పారు. బాలా మావయ్యకి పుట్టినరోజు శుభాకాంక్షలు అని పేర్కొన్న ఆయన కథానాయకునిగా ఇటు సినీ అభిమానులకు, హిందూపూర్ శాసనసభ్యునిగా అటు ప్రజలకు, బసవ తారకం క్యాన్సర్ ఆసుపత్రి చైర్మన్ గా ఆపదలో ఉన్న ప్రతి ఒక్కరికీ మీ నిష్కళంక, నిస్వార్థ ప్రేమను పంచుతున్న మీ ఔదార్యం మాకు ఆదర్శం అని అన్నారు. 

బాలా మావయ్యా! మీరిలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని... అభిమానులకు నిత్య సంబరాలు జరుపుకునేలా, మరెన్నో చిత్రాలలో, విభిన్న పాత్రలలో నటిస్తూ నిండు నూరేళ్లూ వర్ధిల్లేలా దీవించమని ఆ దేవుడిని కోరుకుంటున్నానని లోకేష్ పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: