తమిళ స్టార్ హీరో ధనుష్ ఇటీవలే జగమే తంత్రం అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.. కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో అనేక అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా మిశ్రమ స్పందన తెచ్చుకుంటోంది. ఆ సినిమా తర్వాత ఇప్పటికే హిందీ, హాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉన్న ఆయన కొత్తగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఒక ట్రై లింగ్యువల్ సినిమా కూడా అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. 


తాజాగా అందుతున్న సమాచారం మేరకు ఆయన తెలుగులో మరో డైరెక్ట్ సినిమా చేయడానికి ఒప్పుకున్నట్లు సమాచారం. సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ లో వెంకీ అట్లూరితో సినిమా చేసే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా త్వరలోనే వెలువడే అవకాశం కనిపిస్తోంది. నిన్నటి నుంచి ఒక దర్శకుడు అని ప్రచారం జరగగా ఇప్పుడు తాజాగా వెంకీ అట్లూరి పేరు బయటకు వచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: